ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి తీవ్రంగా ఫైర్ అయ్యారు. ప్రతి సంవత్సరం మహానాడు సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్ కి భారతరత్న అంటూ ఆటపట్టించడంపై ఫైర్ అయ్యారు విజయసాయి రెడ్డి. 

"బతికున్నోళ్లను మభ్యపెట్టడానికి పొగడ్తలతో మునగ చెట్టు ఎక్కించడం చూస్తుంటాం. 25 ఏళ్ళ క్రితం మరణించిన ఎన్టీఆర్ ను భారతరత్న పేరుతో ఆటపట్టించడం ఆయనకు ఆత్మశాంతి లేకుండా చేయడమే. ప్రతి ఏటా తీర్మానం చేస్తారు. ప్రధానులు, రాష్ట్రపతులను చేశానని చిటికెలేసే వ్యక్తి ఇలా డ్రామాలాడటం నీచాతినీచం" అని ట్విట్టర్ వేదికగా రాసుకోచ్చార్ఫు విజయ సాయి రెడ్డి. 

ఇక మరో ట్వీట్లో చంద్రబాబుపై నెగటివ్ థింకింగ్ పితామహ అంటూ ఫైర్ విమర్శలు గుప్పించారు విజయసాయి రెడ్డి.  "కరోనా కాలంలో కుట్రలు చేయడం ఎలా... అనే విషయంపై ఎవరైనా మాస్టర్ డిగ్రీ/ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఆన్ లైన్ కోర్సులు జూమ్  యాప్ ద్వారా చేయాలనుకుంటే.. మన నెగటివ్ థింకింగ్ పితామహ గడ్డం బాబుని సంప్రదించవచ్చు" అని ట్వీట్ చేసారు.