Asianet News TeluguAsianet News Telugu

ధర్మకర్తనా, అధర్మకర్తనా?: ఆశోక్‌గజపతిరాజుపై ఎంపీ విజయసాయి ఫైర్


మాజీ కేంద్ర మంత్రి ఆశోక్‌గజపతిరాజుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు.  దేవుడి ఆస్తులు కొల్లగొట్టడంలో ఆశోక్‌గజపతిరాజు పాత్రపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.

Vijayasai Reddy serious comments on Ashok Gajapathi raju
Author
Visakhapatnam, First Published Sep 3, 2021, 1:40 PM IST

విశాఖపట్టణం: మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ నేత అశోక్ గజపతిరాజుపై  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. దేవుని ఆస్తులు కొల్లగొట్టడంలో అశోక్ గజపతిరాజు పాత్రపై అనుమానాలున్నాయని  ఆయన ఆరోపించారు.శుక్రవారం నాడు  ఆయన అప్పన్నస్వామిని దర్శించుకొన్న తర్వాత ఆయన  మీడియాతో మాట్లాడారు.

అశోక్‌ గజపతిరాజు ధర్మకర్తనా.. అధర్మకర్తనా..? అనే సందేహాల్ని విజయసాయిరెడ్డి వ్యక్తం చేశారు. అప్పన్న స్వామి భూములు అవకతవకల్లో ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతి రాజు పాత్రపై అనుమానం కలుగుతోందన్నారు విజయసాయి రెడ్డి విమర్శించారు.

ఆలయ భూములు, దేవాలయం ఆస్తులలో అవకతవకలకు పాల్పడకపోతే కోర్టుకు వెళ్లి మళ్ళీ పదవి ఎందుకు తెచ్చుకున్నారని విజయసాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.  పంచగ్రామాల భూసమస్య న్యాయస్థానంలో ఉండటం వలన న్యాయ పరిధిలో త్వరగా పరిష్కరించే దిశగా కృషి చేస్తామని ఆయన అన్నారు.

అశోక్ గజపతి రాజు హయాంలో దేవాలయంలో అన్ని స్కాములే చోటు చేసుకొన్నాయని ఆయన చెప్పారు. వీటన్నింటిని బయటపెట్టి దేవాలయ ఆస్తులను కాపాడుతామన్నారు. దేవస్థానం ఆస్తులు పరాధీనం పాలు అవుతుంటే ఏంచేస్తున్నారని ఆయన ఆశోక్‌గజపతిరాజును ప్రశ్నించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios