చంద్రబాబుపై మరోసారి వ్యంగ్యాస్త్రాలు విసిరారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను చంద్రబాబు చేయడం దరిద్రంగా ఉందంటూ కామెంట్స్ చేశారు.
అమరావతి : TDP అన్నా, చంద్రబాబు అన్నా విరుచుకుపడడంలో ముందుండే విజయసాయిరెడ్డి.. మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ vijayasai reddy టిడిపి ఆవిర్భావ దినోత్సవంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఎవరో కన్నబిడ్డకు, ఇంకెవరో బర్త్ డే సెలబ్రేట్ చేసినంత దరిద్రంగా టిడిపి ఆవిర్భావ కార్యక్రమం ఉందని’ విమర్శలు గుప్పించారు. టీడీపీ chandrababu naidu పెట్టిన పార్టీ కాదని, NTR నుంచి దొంగతనంగా గుంజుకున్నదని ప్రజలందరికీ తెలుసన్నారు. ‘చంద్రబాబు కపట వేషాలు చూస్తూ పైన ఉన్న ఆ పెద్దాయన ఆత్మ ఎంతగా క్షోభిస్తోందో’.. అంటూ చురకలంటించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి బుధవారం ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా, తెలుగువారి సంక్షేమమే టిడిపి పరమావధి అని మంగళవారం చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధికారం కోసం ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేయలేదని చంద్రబాబు తెలిపారు. మళ్లీ ఒకసారి అందరూ తెలుగు జాతికి పునరంకితం కావాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు.
తాను తెలంగాణను ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ను తాను ఎంతో అభివృద్ధి చేశానని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ తరహాలో అమరావతిని తయారు చేయాలనుకున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారని.. కోకాపేటలో ఎకరం 60 వేల ఉన్నది ఇప్పుడు కోట్లు పలుకుతుందని ఆయన గుర్తు చేశారు. కోకాపేటలో ఫార్ములా వన్ రేసింగ్ పెట్టాలని అనుకున్నానని చంద్రబాబు వెల్లడించారు. తెలుగు గంగ లాంటి ఎన్నో ప్రాజెక్టులు ఎన్టీఆర్ ప్రారంభించారని వ్యాఖ్యానించారు.
కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు లాంటి ఎన్నో ప్రాజెక్టు ప్రారంభించారని చంద్రబాబు గుర్తు చేశారు. పోలవరంతో నదుల అనుసంధానానికి సంకల్పం చేశానని ఆయన తెలిపారు. తాను ఆనాడు చేసిన అభివృద్ధి ఫలాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. అంతకు ముందు టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ టీడీపీ ముందు టిడిపి తర్వాత అన్నట్లుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. సంక్షేమం, అభివృద్ధి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది ఎన్టీరామారావు అని చంద్రబాబు ప్రశ్నించారు.
సంవత్సరాలలో ఎన్నో చరిత్ర సృష్టించాలని చేశానని ఆయన గుర్తు చేశారు. మళ్లీ ఇవ్వాళ జాతికి పునరంకితం కావలసిన సందర్భం యువత ముందుకు రావాల్సిన సందర్భం ఉందన్నారు తెలుగుదేశం పార్టీని తెలుగుజాతిని ఎవరూ విడదీయలేరు అని చంద్రబాబు అన్నారు తెలుగు వారు ఎక్కడ ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు 40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించిందని అన్నారు.
