చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ను సర్కస్‌లో ఉండే బఫూన్ క్యారెక్టర్‌తో పోలుస్తూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.  ఆయన కామెడీకి అడ్డూ అదుపూ ఉండదంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు.

అమరావతి: చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి వ్యంగ్యాస్త్రం సంధించారు. నారా లోకేశ్‌ను సర్కస్‌లో ఉండే బఫూన్ క్యారెక్టర్ పోలుస్తూ ట్వీట్ చేశారు. లోకేశ్ రాజకీయాల్లో ఉంటే నాన్ స్టాప్ కామెడీనే ఉంటుందని చలోక్తులు విసిరారు.

‘రాజకీయాలను సర్కస్‌తో పోల్చడం కొత్తేమీ కాదు. కాకపోతే సర్కస్‌లో ఉండే బఫూన్ క్యారెక్టర్లు రాజకీయాల్లో ఉంటే నాన్ స్టాప్ కామెడీనే’ అని పేర్కొన్నారు. మోకాల్లోతు నీళ్లలో లైఫ్ జాకెట్‌తో దిగి లోకేశ్ బఫూన్ హాస్యం పండిస్తున్నాడు. చిట్టి నాయుడి కామెడీకి స్టాప్ గేట్లు ఉండవు’ అని ట్వీట్ చేశారు.