రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్‌‌గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. ఈ విషయాన్ని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ నేడు సభలో వెల్లడించారు. 

రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్‌‌గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. ఈ విషయాన్ని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ నేడు సభలో వెల్లడించారు. అలాగే వైఎస్ చైర్మన్ ప్యానెల్‌లో మాజీ అథ్లెట్, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉషకు కూడా చోటుచేసుకున్నారు. డిసెంబర్ 19 నుంచే ఈ నియామకం అమల్లోకి వచ్చినట్టుగా చెప్పారు. ఇటీవల రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ పునర్‌నిర్మించిన వైస్‌ చైర్మన్‌ ప్యానెల్‌ జాబితాలో విజయసాయిరెడ్డి పేరుంది. ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదిక షేర్ కూడా చేశారు. 

అయితే ఆ తర్వాత రాజ్యసభలో అధికారిక ప్రకటన చేస్తున్న సమయంలో జగదీప్ ధన్‌కర్ మాత్రం.. ప్యానల్ వైఎస్ చైర్మన్ జాబితా పునర్‌వ్యవస్థీకరించామని చెప్పి ఏడు పేర్లే ప్రకటించారు. మరోవైపు రాజ్యసభ వెబ్‌సైట్‌లో కూడా ఇదే విధంగా కనిపించింది. అయితే మిగిలిన వారి పేర్లను ఉంచి.. విజయసాయిరెడ్డి పేరును మాత్రమే తొలగించారని ప్రతిపక్షాలు వ్యంగ్యస్త్రాలు సంధించాయి.

Scroll to load tweet…
Scroll to load tweet…

అయితే తాజాగా మరోమారు విజయయసాయి రెడ్డి రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ ప్రకటనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన విజయసాయిరెడ్డి.. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి‌లకు కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పారు. హౌస్‌లోని సభ్యులు సంతృప్తి చెందేలా రాజ్యసభ సజావుగా జరిగేలా తాను ప్రయత్నిస్తానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.