తిరుపతి జిల్లా చంద్రగిరిలో వెలుగు ఏపీఎం ఆడియో కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే పల్లెబాట నేపథ్యంలో.. తప్పకుండా హాజరుకావాలని మహిళా సంఘాలను ఆయన ఆదేశించినట్టుగా చెబుతున్న ఆడియో వైరల్ అవుతుంది.
తిరుపతి జిల్లా చంద్రగిరిలో వెలుగు ఏపీఎం ఆడియో కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే పల్లెబాట నేపథ్యంలో.. తప్పకుండా హాజరుకావాలని మహిళా సంఘాలను ఆయన ఆదేశించినట్టుగా చెబుతున్న ఆడియో వైరల్ అవుతుంది. వివరాలు.. మూడేళ్ల తర్వాత ఎమ్మెల్యే మొదటిసారి పల్లెబాటకు వస్తున్నారని.. ఆ పర్యటనను విజయవంతం చేయాలని మహిళా సంఘాలకు వెలుగు ఏపీఎం వాట్సాప్‌లో సందేశం పంపారు. కథలు చెప్పకుండా, లీవ్‌లు పెట్టుకుండా రావాలని ఆదేశించారు.
ఒకవేళ హాజరు కాకపోతే ఆసరా దరఖాస్తులకు సంతకాలు పెట్టనని ఏపీఎం వారిని బెదిరించారు. ఈ ఆడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వెలుగు ఏపీఎం వారం రోజులు లీవ్‌పై వెళ్లారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
