Asianet News TeluguAsianet News Telugu

‘నువ్వు పోటుగాడివా...’, ‘నువ్వే ఊసరవెల్లివి...’ విజయవాడ వైసీపీలో తిట్ల దండకం..

విజయవాడ వైసీపీలో ఎమ్మెల్యేలు ఒకరినొకరు తిట్టుకోవడం.. పరుషపదజాలంతో వాగ్భాణాలు వేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. 

Vellampalli vs Udayabhanu.. YCP MLA controversy in vijayawada - bsb
Author
First Published Jan 25, 2023, 7:41 AM IST

విజయవాడ : వైసీపీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం విజయవాడలో చర్చనీయాంశంగా మారింది. ఒకరినొకరు పరుష పదజాలంతో దూషించుకోవడం రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. విజయవాడలో వైసిపి నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా విజయవాడ పటమటలోని పార్టీ కార్యాలయానికి జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఉదయభాను తిరిగి వెళుతున్న సమయంలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ తూర్పు నియోజకవర్గ పార్టీ ఇంచార్జి దేవినేని అవినాష్ వచ్చారు.

ఈ క్రమంలో ఉదయభాను.. వెలంపల్లి ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఉదయభాను చూడగానే వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. నా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతను ముఖ్యమంత్రి దగ్గరికి  తీసుకెళ్లడానికి నువ్వు ఎవరు? పోటుగాడివా.. అంటూ.. విరుచుకుపడ్డారు. దీంతో ఆగ్రహానికి వచ్చిన ఉదయభాను..‘ నేను పార్టీలో సీనియర్ లీడర్ని. పదవికోసం నీలా పార్టీ మారలేదు. నువ్వు పదవుల కోసం మూడు పార్టీలు మారావు. ఊసరవెల్లివి.. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది... నువ్వు నాకు చెప్పేదేంటి..’ అని ఉదయభాను కూడా  పరుష పదజాలంతో దూషించారు. గొడవ గమనించిన ఇరువర్గాల ఎమ్మెల్యేల అనుచరులు వారిద్దరినీ  అక్కడి నుంచి పక్కకు తీసుకువెళ్లారు. దీంతో గొడవ అప్పటికి సద్దుమణిగింది.

పొత్తులపై మాట మార్చిన సోము వీర్రాజు.. పవన్ చెప్పారుగా, కన్‌ఫ్యూజన్ లేదన్న ఏపీ బీజేపీ చీఫ్

అసలు గొడవ ఎందుకంటే…
2014లో ఆకుల శ్రీనివాసరావు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఓడిపోయారు. అదే ఎన్నికల్లో వెలంపల్లి శ్రీనివాసరావు కూడా బిజెపి అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన కూడా ఓడిపోయారు. అయితే ఇటీవల కొంతకాలంగా ఆకుల శ్రీనివాసరావు వైసీపీకి  అనుకూలంగా ఉంటున్నాడు. వైసీపీ ఎమ్మెల్యే ఉదయభాను  గతవారం తన నియోజకవర్గ సమస్యలపై మాట్లాడడానికి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన సమయంలో.. అక్కడ ఆశ్చర్యకరంగా ఆకుల శ్రీనివాసరావు కనిపించాడు.

ఉదయభానుతో మాట్లాడుతూ జనవరి 28న తన కూతురు పెళ్లికి  ముఖ్యమంత్రిని పిలవడానికి వచ్చానని తెలిపాడు. ఉదయభాను ఆకుల శ్రీనివాసరావును తనతో పాటు సీఎం దగ్గరికి తీసుకువెళ్లి కల్పించాడు. వివాహ ఆహ్వానపత్రిక ఇప్పించాడు. అయితే ఇది వెలంపల్లికి ఆగ్రహం తెప్పించింది.. తన మీద పోటీ చేసిన వ్యక్తిని ఉదయభాను జగన్ దగ్గరికి తీసుకువెళ్లడంపై మండిపడ్డాడు.

Follow Us:
Download App:
  • android
  • ios