Asianet News TeluguAsianet News Telugu

‘‘పిచ్చి పిచ్చిగా ఉందా?’’.. ప్రశ్నించిన యువకుడిపై మాజీ మంత్రి వెల్లంపల్లి ఫైర్..

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు చేదు అనుభవం ఎదురైంది. వైసీపీ గడప గడపకు కార్యక్రమంలో భాగంగా విజయవాడలో పర్యటిస్తున్న ఆయనకు నిరసన సెగ తలిగింది. ఈ క్రమంలోనే తనను ప్రశ్నించిన యువకుడిపై వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. 

Vellampalli Srinivas fires on a youth for questioning him over corruption allegations
Author
First Published Jun 18, 2022, 5:16 PM IST

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు చేదు అనుభవం ఎదురైంది. వైసీపీ గడప గడపకు కార్యక్రమంలో భాగంగా విజయవాడలో పర్యటిస్తున్న ఆయనకు నిరసన సెగ తలిగింది. చెత్తపన్ను భారం మోయలేకపోతున్నామని 50వ డివిజన్‌కు చెందిన నాగబాబు  అనే యువకుడు వెల్లంపల్లి ముందు ఆవేదన వ్యక్తం చేశాడు.  ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసిందని ప్రతిపక్షాల ఆరోపణలను ప్రస్తావించి నిలదీశారు. దీంతో మాజీ మంత్రి ఆవేశంతో ఊగిపోయాడు. తనపై ఆరోపణలు చేసిన యువకుడిపై కేసు పెట్టాలని సీఐని ఆదేశించారు. అవినీతి ఆరోపణలను రుజువు చేయకుంటే లోపలేయాని సీఐతో అన్నారు. 

అసలేం జరిగిందంటే.. గడప గడపకు వైసీపీలో పాల్గొన్న మాజీ మంత్రి వెల్లంపల్లి ముందు ఓ యువకుడు ప్రతిపక్షాల ఆరోపణలను ప్రస్తావించాడు. దీంతో ఆవేశానికి లోనైన వెల్లంపల్లి.. ‘‘పిచ్చి పిచ్చిగా మాట్లాడకు.. టీడీపీ వాళ్లు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావ్.. నీ మీద కేసు పెట్టమంటవా?’’ అని అన్నారు. చెత్త పన్ను గురించి మాట్లాడుతుండగా.. చెన్నైలో ఉండేవాడివి ఇక్కడ నీకేం సంబంధం అని మాజీ మంత్రి ఫైర్ అయ్యారు. ఆ యువకుడు మధ్యలో మాట్లాడే ప్రయత్నం చేయగా అతడిని నోర్ము అని గట్టిగా వారించారు.

 

 

‘‘సీఐ గారు అతని మీద కేసు పెట్టండి. రూ. 1,500 కోట్లు అవినీతి చేశానని చెప్తున్నాడు. రుజువు చేయకపోతే అతడిపై కేసు పెట్టి లోపలేయండి. ఏం జరిగిందో నాకు చెప్పాలి. ప్రతి వాడికి ఇదో ఫ్యాషన్ అయిపోంది’’ అని వెల్లంపల్లి అన్నారు. ‘‘పిచ్చిపిచ్చిగా ఉందా.. నోర్ముయ్’’ అని మంత్రి వెల్లంపల్లి యువకుడిపై బెదిరింపులకు పాల్పడటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోను టీడీపీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios