Asianet News TeluguAsianet News Telugu

రోజాపై అనుచిత వ్యాఖ్యలు.. టీడీపీ నేత బండారును అరెస్ట్ చేయాలని డీజీపీకి వాసిరెడ్డి పద్మ లేఖ..

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత బండారు సత్యనారాయణ‌పై చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు.

vasireddy padma letter to DGP to take action on TDP Bandaru Satyanarayana for his comments on roja ksm
Author
First Published Sep 30, 2023, 3:51 PM IST

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత బండారు సత్యనారాయణ‌పై చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. మంత్రి రోజాపై జుగుప్సాకరంగా మాట్లాడిన బండారు సత్యనారాయణను అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు డీజీపీకి వాసిరెడ్డి పద్మ లేఖ రాశారు. మంత్రి రోజాపై సభ్య సమాజం తలదించుకునే వ్యాఖ్యలు చేసిన  బండారు సత్యనారాయణపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో వాసిరెడ్డి పద్మ కోరారు. బండారు సత్యనారాయణ మాట్లాడిన నీచమైన భాష జుగుప్సాకరంగా ఉందని పేర్కొన్నారు.

ఒక మంత్రిపై, రాజకీయాల్లో ఉన్న మహిళా నేతపై ప్రెస్ మీట్‌లు పెట్టి బండబూతులు మాట్లాడుతున్నారని.. వీటిని ఎంత మాత్రం సహించరాదని కేసు నమోదు చేసి తక్షణం అరెస్టు చేయాలని డీజీపీని వాసిరెడ్డి పద్మ కోరారు. మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పలువురు మహిళా నేతలు, న్యాయవాదులు.. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారని పద్మ తెలిపారు. 

బండారు సత్యనారాయణ వంటి మహిళా వ్యతిరేకులకు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై అందరూ సీరియస్ గా స్పందించాలని కూడా పేర్కొన్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios