విజయవాడ:ఏపీ ఆర్టీసీ ఛైర్మెన్  వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్నం వైసీపీలో చేరనున్నారు. వర్ల రత్నం వైసీపీ చీఫ్ జగన్‌తో భేటీ కానున్నారు.ఏపీ ఆర్టీసీ ఛైర్మెన్‌ వర్ల రామయ్య ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. ఆయన సోదరుడు వర్ల రత్నం కృష్ణా జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడుగా కొనసాగుతున్నారు.

వర్ల రత్నం టీడీపీని వీడి వైసీపీలో చేరాలని  భావిస్తున్నారు. రత్నం వైసీపీ చీఫ్ జగన్‌ను కలిసి ఆ పార్టీలో చేరనున్నారు. అయితే రత్నం  ఎప్పుడు వైసీపీలో చేరుతారనేది ఇంకా స్పష్టత లేదు.