తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ ప్రచారం చేయాలని అనుకున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య చెప్పారు. అయితే.. కేటీఆర్ వద్దు అనడంతో.. జగన్ తన ప్రచార నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు వర్ల రామయ్య తెలిపారు.

ఈ రోజు మీడియాతో మాట్లాడిన వర్ల రామయ్య.. టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణలో కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే అని తెలిపారు. ఏ ప్రాజెక్టును చంద్రబాబు అడ్డుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణలో పవన్ ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారో.. ప్రకటించాలని ఈ సందర్భంగా వర్ల డిమాండ్ చేశారు.