Asianet News TeluguAsianet News Telugu

విషాదంగా మారిన విహారయాత్ర.. సముద్రంలోకి కొట్టుకుపోయిన ఆరుగురు స్నేహితులు

Vizag: వారాంతపు వినోదం విషాదంగా మారింది. విహారయాత్రకు వచ్చిన ఆరుగురు స్నేహితులు స‌ముంద్రంలోకి కొట్టుకుపోయారు. ఈ క్ర‌మంలోనే వారిని గుర్తించి అప్ర‌మ‌త్త‌మైన మ‌త్స్య‌కారులు ఐదుగురిని కాపాడారు. వీరిలో ఒక‌రు అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లారు. ఆరో వ్య‌క్తి స‌ముంద్రంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. అత‌ని మృత‌దేహం సముద్రం ఒడ్డుకు కొట్టుకువ‌చ్చింది. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న వైజాగ్ లో చోటుచేసుకుంది.
 

vacation that turned into a tragedy.. Six friends who were washed into the ocean, Vizag RMA
Author
First Published Aug 22, 2023, 3:57 AM IST

Weekend fun turns tragedy In Vizag: వారాంతపు వినోదం విషాదంగా మారింది. విహారయాత్రకు వచ్చిన ఆరుగురు స్నేహితులు స‌ముంద్రంల‌కి కిట్టుకుపోయారు. ఈ క్ర‌మంలోనే వారిని గుర్తించి అప్ర‌మ‌త్త‌మైన మ‌త్స్య‌కారులు ఐదుగురిని కాపాడారు. వీరిలో ఒక‌రు అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లారు. ఆరో వ్య‌క్తి స‌ముంద్రంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. అత‌ని మృత‌దేహం సముద్రం ఒడ్డుకు కొట్టుకువ‌చ్చింది. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న వైజాగ్ లో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకెళ్తే.. సరదాగా వీకెండ్ కోసం వచ్చిన ఆరుగురు స్నేహితులు సముద్రంలో కొట్టుకుపోయారు. మత్స్యకారులు అప్రమత్తమై ఐదుగురిని రక్షించారు. గల్లంతైన వ్యక్తి మృతదేహం ఆ తర్వాత ఒడ్డుకు కొట్టుకువ‌చ్చింది. మరొకరు అపస్మారక స్థితిలో ఉన్నారు. విశాఖపట్నానికి చెందిన కట్టోజు సాయి (19), కట్టోజు కావ్య (17), సింహాచలానికి చెందిన గన్నవరపు సాయి ప్రియాంక (27), గన్నవరపు రవిశంకర్ (28), అల్లిపురానికి చెందిన కందిపల్లి ఫణీంద్ర (25), కందిపల్లి సాయికిరణ్ (25) కలిసి ఆదివారం ఉదయం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతాపాలెం బీచ్ కు విహారయాత్రకు వెళ్లారు.

అందరూ కలిసి స్నానం చేశారు. ఆ తర్వాత ఒడ్డుకు సమీపంలో ఉన్న రాళ్లపై నిలబడి ఫొటోలు తీస్తుండగా అకస్మాత్తుగా పెద్ద అల వచ్చి వారందరినీ స‌ముద్రంలోకి లాక్కెళ్లిపోయింది. ఇది గ‌మ‌నించి వెంటనే అప్రమత్తమైన మత్స్యకారులు వారిని రక్షించేందుకు సముద్రంలోకి వెళ్లారు. అప్పటికే సాయి కొట్టుకుపోగా మిగిలిన ఐదుగురిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. సముద్రపు నీరు తాగి సాయి ప్రియాంక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అనంతరం అచ్యుతాపురం మండలం పూడిమడక వద్ద సాయి మృతదేహం ఒడ్డుకు చేరింది. కోమాలోకి వెళ్లిన సాయి ప్రియాంక ప్రస్తుతం విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఒడ్డుకు కొట్టుకువ‌చ్చిన సాయి మృతదేహాన్ని వాహనంలో తరలించే ప‌రిస్థితి లేకపోవడంతో అచ్యుతాపురం ఎస్సై సన్యాసినాయుడు ఆధ్వర్యంలో పోలీసులు రెండు కిలోమీటర్లు మోసుకెళ్లి మానవత్వం చాటుకున్నారు. అనంతరం అంబులెన్స్ లో అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు.  ఈ క్రమంలోనే అధికారులు ప్రజలను హెచ్చరించారు. సముంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios