ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కొమరపాలెంలో  ఆదివారం నాడు చిన్నా అనే యువకుడిని  దుండగులు కత్తితో పొడిచి చంపారు.  ఈ ఘటనపై  మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేశారు.

రాజమండ్రి: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కొమరపాలెంలో ఆదివారం నాడు తెల్లవారుజామున చిన్నా అనే యువకుడిని దుండగులు కత్తితో పొడిచి చంపారు. కొత్త సంవత్సరం వేళ చిన్నాకు దుండగుల మధ్య గొడవ జరిగిందని చెబుతున్నారు.ఈ గొడవ తర్వాత చిన్నా ఇంటికి వచ్చిన దుండగులు అతనిపై కత్తితో దాడికి దిగినట్టుగా స్థానికులు చెబుతున్నారు. చిన్నాపై దుండగులు దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీ దృశ్యాల్లో రికార్డయ్యాయి. ఈ విషయమై మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.