పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో శిశివు కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా లేడీ కిడ్నాపర్ కోసం గాలిస్తున్నారు.

పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో శిశివు కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. ఓ లేడీ కిలాడీ శనివారం మాస్క్ పెట్టుకుని ఆసుపత్రిలోకి వెళ్లింది. శిశువును ఎత్తికెళ్లేందుకు ప్రయత్నించగా...పక్కనేవున్న పేషెంట్లు ఆమెను నిలదీశారు. దీంతో భయపడి శిశువును అక్కడే వదిలి పరారైంది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా లేడీ కిడ్నాపర్ కోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.