Asianet News TeluguAsianet News Telugu

నెల్లూరులో టీడీపీ నేత ఆనం వెంకట రమణా రెడ్డిపై దాడికి యత్నం.. వైసీపీ పనేనన్న లోకేష్

టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డిపై దుండగులు దాడికి యత్నించడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. ఆనంపై దాడి విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు అక్కడికి చేరుకున్నారు.

unknown persons try to attack on tdp leader anam venkataramana reddy in nellore ksp
Author
First Published Jun 4, 2023, 3:45 PM IST

టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డిపై దుండగులు దాడికి యత్నించడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. ఆదివారం నెల్లూరు నగరంలోని ఆర్టీఏ కార్యాలయం నుంచి ఆనం బయటకు వస్తుండగా బైక్‌లపై వచ్చిన దుండగులు కర్రలతో ఆయనపై దాడికి యత్నించారు. వెంటనే అప్రమత్తమైన టీడీపీ కార్యకర్తలు, అనుచరులు తీవ్రంగా ప్రతిఘటించడంతో దుండగులు పారిపోయారు. గడిచిన కొంతకాలంగా ఆనం వెంకట రమణా రెడ్డి వైసీపీ పాలనపై విమర్శలు గుప్పిస్తున్నారు. నెల్లూరు యాసలో ఆయన వేసే పంచ్‌లు టీడీపీ కేడర్‌కు, ప్రజలకు నేరుగా కనెక్ట్ అవుతాయి. 

మరోవైపు ఆనంపై దాడి విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు అక్కడికి చేరుకున్నారు. వెంకట రమణా రెడ్డితో మాట్లాడి దాడిపై ఆరా తీశారు. అటు ఆనంపై దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు. ఇది ఖచ్చితంగా వైసీపీ మనుషుల పనేనని ఆయన ఆరోపించారు. వైసీపీ ఫ్యాక్షన్ ముఠాలకు తగిన గుణపాఠం చెబుతామని లోకేష్ స్పష్టం చేశారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios