Asianet News TeluguAsianet News Telugu

సురక్షితం: మాజీ మంత్రి శంకర నారాయణ కాన్వాయ్ పై డిటోనేటర్ విసిరిన దుండగుడు

శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో  మాజీ మంత్రి శంకర నారాయణ కాన్వాయ్ పై  డిటోనేటర్ విసిరాడు దుండగుడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Unknown Person  throws detonator on Former Minister  Sankaranarayana Convoy in sri sathya sai district lns
Author
First Published Oct 8, 2023, 2:34 PM IST | Last Updated Oct 8, 2023, 2:43 PM IST


అనంతపురం:శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతండాలో మాజీ మంత్రి శంకర నారాయణ కాన్వాయ్ పై  డిటోనేటర్ ను విసిరాడు దుండగుడు. అయితే డిటోనేటర్ పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే డిటోనేటర్ పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.  గడప గడపకు మన ప్రభుత్వం  కార్యక్రమం  200 రోజులు పూర్తైన సందర్భంగా గోరంట్లలో పార్టీ కార్యకర్తలతో కలిసి  ర్యాలీ చేస్తున్న సమయంలో  ఈ ఘటన చోటు చేసుకుంది.

డిటోనేటర్ పేలక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.  ఈ ఘటనతో అంతా భయాందోళనలకు గురయ్యారు.  డిటోనేటర్  వేసినట్టుగా అనుమానిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే  మాజీ మంత్రి శంకర నారాయణ కాన్వాయ్ పై  డిటోనేటర్ ఎందుకు విసిరాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.పెనుకొండ అసెంబ్లీ స్థానం నుండి శంకర నారాయణ తొలిసారిగా వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు.  జగన్ మంత్రివర్గంలో  శంకర నారాయణకు మంత్రి పదవి కూడ దక్కింది. పెనుకొండ అసెంబ్లీ స్థానం నుండి గతంలో  ప్రాతినిథ్యం వహించిన  బీకే పార్థసారథిని ఓడించి శంకరనారాయణ 2019లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.  పెనుకొండ  అసెంబ్లీ స్థానం టీడీపీకి కంచుకోట.  గతంలో ఈ అసెంబ్లీ స్థానం నుండి పరిటాల రవి ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios