ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ దేశాల ప్రతినిధులు ప్రాతినిధ్యం వహించే ఐక్యరాజ్యసమితి నుంచి ఆహ్వానం అందింది. సెప్టెంబర్ 24వ తేదిన న్యూయార్క్‌లో జరగబోయే ఐక్యరాజ్యసమితి సదస్సులో చంద్రబాబును ప్రసంగించాలని ఆహ్వానంలో కోరారు..

‘‘ ఫైనాన్సింగ్ సస్టైనబుల్ అగ్రికల్చర్.. గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్’’ అనే అంశంపై చంద్రబాబు ప్రసంగించనున్నారు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ విధానంతో పాటు సేంద్రియ వ్యవసాయం రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను సమితి ప్రసంశించింది.