న్యూఢిల్లీ: కేంద్రబడ్జెట్ లో మార్పులు చేర్పులు ఉంటాయని స్పష్టం చేశారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్రబడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ వైసీపీ ఎంపీ బాలశౌరి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు పోనీ ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వలేదని ప్రశ్నించారు. పన్ను రాయితీలు కూడా కల్పించకపోవడం బాధకరమన్నారు. అయితే గుజరాత్ రాష్ట్రానికి పదేళ్లపాటు పన్ను మినహాయింపు ఇవ్వడంపై ప్రశ్నించారు.

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ తో చాలా సమస్యలు ఎదుర్కొంటుందని లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాలని లేఖలో కోరారు. ఎంపీ బాలశౌరి లేఖపై స్పందించిన నిర్మలా సీతారామన్ ఏపీకీ న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు.