Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుకు గడ్కరీ లేఖ....అయోమయంలో ఏపీ సర్కార్

ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ లేఖ రాశారు. ప్రకాశం జిల్లా ఓడరేవులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రపంచస్థాయి సౌకర్యాలున్న పోర్టు ఏర్పాటు చేద్దామంటూ లేఖలో పేర్కొన్నారు. అందుకు ప్రభుత్వం తరపున ఎస్‌పీవీని ఏర్పాటు చేయాలని గడ్కరీ లేఖలో కోరారు. 
 

union minister gadkari writes a letter to cm chandrababu naidu
Author
Amaravathi, First Published Sep 27, 2018, 3:53 PM IST


అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ లేఖ రాశారు. ప్రకాశం జిల్లా ఓడరేవులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రపంచస్థాయి సౌకర్యాలున్న పోర్టు ఏర్పాటు చేద్దామంటూ లేఖలో పేర్కొన్నారు. అందుకు ప్రభుత్వం తరపున ఎస్‌పీవీని ఏర్పాటు చేయాలని గడ్కరీ లేఖలో కోరారు. 

రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు వస్తే అన్ని అనుమతులు తీసుకోవచ్చని సూచించారు. ఓడరేవులో పోర్టు ఏర్పాటుకు సౌకర్యాలు అనువుగా ఉన్నాయని గడ్కరీ లేఖలో పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుంటే బాగుంటుందని సూచించారు.
 
మరోవైపు ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రామాయపట్నం పోర్టుకు సంబంధించి అన్ని ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేసింది. 

ఇప్పటికే రామాయపట్నం పోర్టు ఏర్పాటు చెయ్యాలంటూ పెద్ద ఎత్తున అన్ని వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఓడరేవులో పోర్టు ఏర్పాటుకు కేంద్రం నుంచి వచ్చిన లేఖను ప్రభుత్వ వర్గాలు పరిశీలిస్తున్నాయి. అయితే ప్రభుత్వం తలచింది ఒకటి కేంద్రం ఆలోచిస్తుంది మరోకటి కావడంతో ఏపీ సర్కార్ అయోమయంలో పడింది.

Follow Us:
Download App:
  • android
  • ios