రైతుల సంక్షేమం కోసం వెంకయ్య తపిస్తారు: స్వర్ణ భారతి ట్రస్ట్ వార్షికోత్సవంలో అమిత్ షా
నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగిన స్వర్ణ భారతి ట్రస్ట్ 20వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోం శాఖ అమిత్ షా పాల్గొన్నారు. వెంకయ్య నాయుడును అమిత్ షా ప్రశంసలతో ముంచెత్తారు.
నెల్లూరు:కేంద్ర మంత్రి నుండి ఉప రాష్ట్రపతి వరకు అనేక పదవులకు వెంకయ్య నాయుడు వన్నె తెచ్చారని అమిత్ షా చెప్పారుస్వర్ణభారతి ట్రస్ట్ 20వ వార్షికోత్సవ వేడుకలు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఆదివారం నాడు జరిగాయి.ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.రైతు సంక్షేమం కోసం వెంకయ్యనాయుడు ఎప్పుడూ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆలోచిస్తారన్నారు. రాజకీయంగా, సామాజికపరంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య చేసిన సేవలను ఆయన ప్రశంసించారు. స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో సాగుతున్న సేవలు అభినందనీయమని కేంద్ర మంత్రి Amit Shah కొనియాడారు. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో Venkaiah Naidu పాల్గొన్న విషయాన్ని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఎన్నో స్థాయి చర్చల్లో వెంకయ్యనాయుడు చురుకగా పాల్గొన్నారన్నారు.నాలుగు దఫాలు రాజ్యసభకు వెంకయ్యనాయుడు ప్రాతినిథ్యం వహించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.వెంకయ్య నాయుడు గురించి ఆయన స్వస్థలంలోనే మాట్లాడాలనే తన అభిలాష ఇప్పుడు నెరవేరిందని మంత్రి తెలిపారు.
also read:Southern Zonal Council: జల వివాదాలతో పాటు ఏపీ అంశాలను ప్రస్తావించనున్న జగన్
అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రసంగించారు. ఇక్కడికి నరేంద్ర మోడీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను పిలిచిన ఉద్దేశాన్ని ఆయన వివరించారు. ఈ తరహా సేవా కార్యక్రమాలను నిర్వహించే వారిని ప్రోత్సహించాలని కేంద్ర మంత్రి అమిత్ షా ను కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందని వెంకయ్య నాయుడు చెప్పారు.స్వంత ఊరికి రావడంతో పాటు స్థానికులను కలవడం స్వంత భాషలో మాట్లాడడం తనకు సంతోషాన్ని ఇస్తోందన్నారు. సేవ చేస్తే దేవాలయానికి వెళ్లి పూజ చేస్తే ఎంత పుణ్యం వస్తోందో సేవ చేస్తే కూడా అంతే పుణ్యం వస్తోందన్నారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేయడమే తనకు ముఖ్యమన్నారు.అందుకే తాను swarna bharat trust కార్యక్రమంలో పాల్గొనడం తనకు సంతోషాన్ని ఇస్తోందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజల మధ్య అంతరం తగ్గాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
సేవ చేయడమే అసలైన మతమని తాను నమ్ముతానని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పారు. గ్రామీణ మహిళలకు ఒకేషనల్ కోర్సుల కోసం కొత్త భవనం అందుబాటులోకి తెచ్చామన్నారు. దివ్యాంగుల్లోని ప్రతిభను గుర్తించి వారికి శిక్షణ ఇస్తున్నామని వెంకయ్య నాయుడు తెలిపారు. రైతుల సంక్షేమంపై దృష్టి సారించాలని ఆయన కోరారు. యువతకు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పిస్తే అద్బుతాలు సృష్టిస్తారని ఉప రాష్ట్రపతి చెప్పారు. ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించాలనేది తన ఆకాంక్ష అని వెంకయ్య నాయుడు తెలిపారు.మాతృభాష, మాతృభూమిని మర్చిపోవద్దన్నారు.మాతృభాషను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఆయన కోరారు. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి తిరుపతి వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా ఇవాళ నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నుండి ఆయన నేరుగా తిరుపతికి వెళ్లి సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు.