సీఐడీ చీఫ్ సునీల్‌పై ఏం చర్యలు తీసుకొన్నారు: ఏపీ సర్కార్‌కి కేంద్రం లేఖ
ఏపీ సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌పై ఏం చర్యలు తీసుకొన్నారో చెప్పాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఏపీ సర్కార్ కి లేఖ రాసింది. సునీల్‌కుమార్ పై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై కేంద్ర హోశాఖ స్పందించింది.
న్యూఢిల్లీ: ap cid చీఫ్ sunil kumar పై నమోదైన కేసులో ఏం చర్యలు తీసుకొన్నారో చెప్పాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ ap governmentకి లేఖ రాసింది.ycp కి చెందిన రెబెల్ ఎంపీ raghu rama krishnam raju ఏపీ సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ పై కేంద్ర హోంమంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై ఏటీఆర్ సమర్పించాలని ఈ ఏడాది జూలై 4న కేంద్ర హోంమంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
also read:రిజర్వేషన్ వివాదం, చిక్కుల్లో ఏపీ సీఐడీ డీజీ సునీల్ కుమార్, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు
సునీల్‌కుమార్ సతీమణి అరుణ తెలంగాణ సీఐడీ విభాగానికి ఇచ్చిన ఫిర్యాదుతో పాటు అక్కడ నమోదైన ఎప్ఐఆర్ పై ఏం చర్యలు తీసుకొన్నారో తెలపాలని రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ విషయమై ఏం చర్యలు తీసుకొన్నారో చెప్పాలని కేంద్ర హోంశాఖ నుండి వచ్చిన లేఖను రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ముత్యాలరాజు ఏపీ డీజీపీ gautam sawang కు పంపారు. నిబంధనల మేరకు వ్యవహరించాలని సాదారణ పరిపాలన శాఖ డీజీపీకి సూచించింది.