ఏలూరు జిల్లాకు చెందిన ఉంగుటూరు నియోజకవర్గంలో గతంలో వైసిపి విజయం సాధించింది. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పుప్పాల శ్రీనివాసరావు కొనసాగుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి భారీ మెజారిటీతో గెలిచిన నేపథ్యంలో ఈసారి విజయం ఎవరిని వరిస్తుంది? మెజారిటీ ఎంత వుంటుంది? అన్న ఆసక్తి నెలకొంది. 

ఉంగుటూరు రాజకీయాలు :

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఉంగూటూరులో వరుస విజయాలతో దూసుకుపోతున్న టిడిపికి గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసిపి బ్రేకులు వేసింది. 1983, 1985 లో కాటమని శ్రీనివాసరావు టిడిపి తరపున పోటీచేసి వరుస విజయాలు సాధించగా 1989 లో కాంగ్రెస్ గెలిచింది. మళ్లీ 1994,1999లో కొండ్రెడ్డి విశ్వనాధం టిడిపి నుండి పోటీచేసి గెలవగా 2004 లో కాంగ్రెస్ అభ్యర్థి వట్టి వసంత్ కుమార్ గెలిచారు. ఇక 2014 లో గన్ని వీరాంజనేయులు (టిడిపి) విజయం సాధించగా 2019 లో పుప్పాల శ్రీనివాసరావు గెలుపొందారు.

అయితే ఈసారి టిడిపి జనసేన బిజెపి కూటమిగా బరిలోకి దిగుతుంటే వైసిపి మాత్రం ఒంటరిగానే పోటీచేస్తోంది. పొత్తులో భాగంగా ఉంగుటూరు టికెట్ జనసేనకు దక్కింది... కాబట్టి కూటమి అభ్యర్థిగా జనసేన నాయకుడు పత్సమట్ల ధర్మరాజు పోటీ చేస్తున్నారు. 

ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. భీమడోలు
2. నిడమర్రు
3. గణపవరం
4. ఉంగుటూరు 

ఉంగుటూరు అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,00,216
పురుషులు - 99,346
మహిళలు ‌- 1,00,861

ఉంగుటూరు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

సిట్టింగ్ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు) మరోసారి ఉంగుటూరులో పోటీ చేస్తున్నారు. 

జనసేన అభ్యర్థి : 

పొత్తులో భాగంగా ఉంగుటూరు సీటు జనసేనకు దక్కింది. కూటమి అభ్యర్థిగా పత్సమట్ల ధర్మరాజు పోటీ చేస్తున్నారు. 

ఉంగుటూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

ఉంగుటూరు అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,73,841 (86 శాతం)

వైసిపి - పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు) - 94,621 ఓట్లు (54 శాతం) - 33,153 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి - గన్ని వీరాంజనేయులు - 61,468 (35 శాతం) - ఓటమి

జనసేన పార్టీ - నౌడు వెంకట రమణ - 10,721 (6 శాతం) - ఓటమి

ఉంగుటూరు అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,62,595 (86 శాతం)

టిడిపి - గన్ని వీరాంజనేయులు - 82,118 (50 శాతం) ‌- 8,930 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - పుప్పాల శ్రీనివాసరావు - 73,188 (45 శాతం) - ఓటమి