Asianet News TeluguAsianet News Telugu

శాసనమండలి చీఫ్ విప్ గా ఉమ్మారెడ్డి, టీడీపీపక్ష నేతగా యనమల

నిన్నటి వరకు శాసనమండలిలో వైయస్ఆర్సీపీ పక్ష నేతగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు. అయితే ఆ పదవి ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబాబోస్ కు కేటాయించడంతో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును చీఫ్ విప్ గా నియమించారు. ఇకపోతే ప్రభుత్వ విప్ గా గంగుల ప్రభాకర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  
 
Ummareddy venkateswarlu as Chief Whip of the Legislative Council
Author
Amaravathi, First Published Jun 18, 2019, 7:25 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి చీఫ్‌ విప్‌గా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నిమితులయ్యారు. విప్‌గా గంగుల ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసింది. 

నిన్నటి వరకు శాసనమండలిలో వైయస్ఆర్సీపీ పక్ష నేతగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు. అయితే ఆ పదవి ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబాబోస్ కు కేటాయించడంతో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును చీఫ్ విప్ గా నియమించారు. ఇకపోతే ప్రభుత్వ విప్ గా గంగుల ప్రభాకర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  

మరోవైపు శాసనమ మండలిలో టీడీపీ పక్షనేతగా యనమల రామకృష్ణుడును ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మండలి చైర్మన్‌ షరీష్‌ అహ్మద్‌ సభలో ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios