Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ వివేకా హత్య కేసు: ఉమాశంకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న సీబీఐ..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఉమాశంకర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతోంది. గురువారం ఉదయం కడపలో ఉమా  శంకర్ రెడ్డిని ప్రశ్నించారు సీబీఐ అధికారులు. అనంతరం అతనిని పులివెందుల కోర్టుకు తరలించారు. 

uma shankar reddy arrested in ys viveka murder case
Author
Kadapa, First Published Sep 9, 2021, 6:30 PM IST

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఈ కేసులో  సునీల్ యాదవ్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ.. ఉమాశంకర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతోంది. గురువారం ఉదయం కడపలో ఉమా  శంకర్ రెడ్డిని ప్రశ్నించారు సీబీఐ అధికారులు. అనంతరం అతనిని పులివెందుల కోర్టుకు తరలించారు. 

కాగా, 2019 మార్చిలో మాసంలో ఇంట్లోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు గాను అనుమానితులను సీబీఐ విచారిస్తోంది. కడప కేంద్రంగా చేసుకొని సీబీఐ అధికారులు 94 రోజులుగా విచారణ చేస్తున్నారు. అయితే ఇంతవరకు ఈ కేసులో నిందితులను గుర్తించలేదు. 

అయితే హత్యకు ఉపయోగించినట్టుగా బావిస్తున్న ఆయుధాలు, ఇతర కీలక డాక్యుమెంట్లను సీబీఐ గతంలో సీజ్ చేసినట్టుగా ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఈ కేసులో హంతకులను పట్టిస్తే నజరానాను ఇస్తామని కూడ సీబీఐ ప్రకటించడం చర్చకు దారితీసింది. ఈ కేసులో పలువురు అనుమానితులతో పాటు వివేకానందరెడ్డి సోదరులను కూడ విచారించింది. ఇవాళ  వివేకానందరెడ్డి సోదరుడు సుధీకర్ రెడ్డిని సీబీఐ విచారించింది. వివేకానందరెడ్డి హత్య కేసులో సమాచార సేకరణలో భాగంగానే సుధీకర్ రెడ్డిని విచారిస్తున్నట్టుగా సమాచారం.
 

Follow Us:
Download App:
  • android
  • ios