కడప జిల్లాలో దారుణం జరిగింది. బ్రహ్మంగారి మఠం మండలం డి నేలటూరులో ఇద్దరు మహిళలను కత్తులతో దారుణంగా నరికిచంపారు గుర్తు తెలియని దుండగులు. మృతులను అంజనమ్మ, లక్ష్మీదేవిగా గుర్తించారు.  

కడప జిల్లాలో దారుణం జరిగింది. బ్రహ్మంగారి మఠం మండలం డి నేలటూరులో ఇద్దరు మహిళలను కత్తులతో దారుణంగా నరికిచంపారు గుర్తు తెలియని దుండగులు. మృతులను అంజనమ్మ, లక్ష్మీదేవిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అయితే 2012లో జరిగిన హత్యలకు ప్రతీకారంగానే వీరి హత్యలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఆస్తుల కోసమే వీరి హత్య జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.