రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరిపై అత్యాచారం జరిగిన ఘటనలు తిరుపతి జిల్లా గూడూరు సమీపంలో చోటుచేసుకున్నాయి. ఇంట్లో నిద్రిస్తున్న మహిళ, ఇంటర్ విద్యార్థిని ఈ ఘటనల్లో బాధితులుగా నిలిచారు.
గూడూరు : ఇంట్లో నిద్రిస్తున్న ఓ మహిళపై కామాంధుడు molestationకి పాల్పడగా.. inter studentకి మాయమాటలు చెప్పి తీసుకువెళ్లి మరో దుర్మార్గుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ వేర్వేరు ఘటనల్లో tirupati జిల్లా గూడూరు సమీపంలో వెలుగు చూశాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
స్నేహితుడి భార్య పై..
గూడూరు గ్రామీణ సీఐ శ్రీనివాసరెడ్డి కథనం మేరకు.. గూడూరు సమీపంలోని చవటపాలెం ప్రాంతంలోని సోగా హరినారాయణ గతంలో పలు కేసుల్లో నిందితుడు. బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో పందులు పట్టేందుకు పక్క వీధిలో కి వెళ్ళాడు. అతని స్నేహితుడు ఇంటి తలుపు తీసి ఉండటాన్ని గుర్తించి లోపలికి దూసుకెళ్ళాడు.
స్నేహితుడి భార్య ఒక్కతే నిద్రిస్తుండగా అత్యాచారం చేయబోయాడు. ప్రతిఘటించిన ఆమెను గాయపరిచి, సమీప ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆమె కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. బాధితురాలిని పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. మూడేళ్ల కిందట ఇదే ప్రాంతంలో ఓ దివ్యాంగురాలిపై యువకులు దాడి చేసి, హత్యాచారానికి పాల్పడగా ప్రస్తుత ఘటనతో మహిళలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.
విద్యార్థినికి మాయమాటలు చెప్పి..
రెండో పట్టణ ఎస్ఐ తిరుపతయ్య కథనం మేరకు గూడూరు సమీపంలోని వేములపాలెం ప్రాంతానికి చెందిన టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పట్టణంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థినితో కొంతకాలంగా స్నేహం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెకు మాయమాటలు చెప్పి సమీప ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టడంతో రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థిని తల్లిదండ్రులు మొరపెట్టుకున్నారు.
ఇదిలా ఉండగా, ఏప్రిల్ 18న Jaipurలో దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. ధన్‌బాద్‌కు చెందిన ఇద్దరు బాలికలపై జైపూర్‌లో ఇద్దరు వ్యక్తులు molestationకి పాల్పడ్డారు. బాలికలు ఇద్దరిని ఓ వ్యక్తి, అతని బావ కలిసి అత్యాచారం చేశారు. దీనికోసం వీరు ఆ బాలికలను పెళ్లి, చదువుల సాకుతో మభ్యపెట్టారు. వారిద్దరిని బాధితులను జైపూర్‌కు రప్పించారు. అర్మాన్, ఆరిఫ్(బావమరిది)గా గుర్తించబడిన నిందితులు ఇద్దరూ బాధితులు ఉన్న ప్రాంతంలోనే నివసిస్తున్నారు.
రంజాన్ సందర్భంగా అర్మాన్ వారి ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకుందామనే సాకుతో చిన్న కుమార్తెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తన కుమార్తెలు కనిపించకుండా పోవడంతో బాధితురాలి తల్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. అందులో అర్మాన్ చిన్న కుమార్తెకు పెళ్లి చేస్తానని హామీ ఇచ్చి ఏప్రిల్ 7న తన కుమార్తెలను జైపూర్‌కు తీసుకెళ్లినట్లు వెల్లడించింది.
చెల్లెలితో పాటు అక్క చదువుకు కూడా సహాయం చేస్తానంటూ నిందితులు అక్కను కూడా ప్రలోభపెట్టినట్లు ఆమె వెల్లడించింది. అయితే రోజుల తరబడి కూతుళ్లిద్దరూ రాకపోవడంతో తల్లి ఝరియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు బాలికలు ఇద్దరు అన్వేషణ ప్రారంభించినప్పుడు, అర్మాన్ తన బావమరిది సహాయంతో అమ్మాయిలిద్దరినీ జైపూర్‌కు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని తేలింది.
విచారణలో, పోలీసులు ఆరిఫ్‌ను పట్టుకున్నారు, అతను వారిని జైపూర్‌కు తీసుకెళ్లాడు, అక్కడ అర్మాన్‌తో ఆ అమ్మాయిలు ఇద్దరూ ఉండడాన్ని గుర్తించారు. ఏప్రిల్ 12న, బాధితులిద్దరూ ధన్‌బాద్‌కు తిరిగి వచ్చారు. అక్కడ అర్మాన్ కుటుంబం వారి కొడుకు బాధితురాలితో వివాహం చేసుకోవడానికి నిరాకరించింది.ఆ తర్వాత, అర్మాన్ తమను జైపూర్ తీసుకెళ్లి అత్యాచారం చేశాడని అక్కాచెల్లెళ్లిద్దరూ ఆరోపించారు. అంతేకాదు విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని అర్మాన్, అతని బావ బెదిరించారని వారు వెల్లడించారు.పోలీసులు మొత్తం కేసును విచారిస్తున్నారని ఝరియా ఎస్‌హెచ్‌ఓ పంకజ్ కుమార్ ఝా తెలిపారు.
