రిసెప్షన్ లో గొడవ.....ఇద్దరి సజీవ దహనం..ఏం జరిగిందంటే..

https://static.asianetnews.com/images/authors/5daec891-66fb-5683-ad67-09c295ebe8bb.jpg
First Published 7, Sep 2018, 2:53 PM IST
two men live burning murdered east godavari
Highlights

ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్న ఆ జంట తల్లిదండ్రులను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. కేవలం కొద్దిమంది బంధువుల సమక్షంలోనే వివాహం జరగడంతో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు ఇరుకుటింబీకులు. దీంతో ఇరుకుటుంబాల మధ్య సందడి వాతావరణం నెలకొంది. రిసెప్షన్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆ జంట కళ్లల్లో ఆనందం నెలకొంది. 

కాకినాడ: ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్న ఆ జంట తల్లిదండ్రులను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. కేవలం కొద్దిమంది బంధువుల సమక్షంలోనే వివాహం జరగడంతో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు ఇరుకుటింబీకులు. దీంతో ఇరుకుటుంబాల మధ్య సందడి వాతావరణం నెలకొంది. రిసెప్షన్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆ జంట కళ్లల్లో ఆనందం నెలకొంది. 

మెుత్తానికి ఆ జంట ఆనందపడే సమయం వచ్చేసింది. రిసెప్షన్ వేడుక ప్రారంభమైంది. బంధువుల సందడితో వేదిక కన్నుల పండువగా జరుగుతుంది. అంతలోనే విషాదం. ఇరుకుటుంబాల మధ్య నెలకొన్ని చిన్న వివాదం రెండు ప్రాణాలను బలితీసునేంత వరకు వెళ్లింది. దీంతో ఆ గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా శంఖవరంలో జరిగింది. 

వివరాల్లోకి వెళ్తే శంఖవరం ఎస్సీ కాలనీకి చెందిన కర్కట నాగేశ్వరరావు కుమారుడు ప్రసాద్, పులి మోజేష్ కుమార్తె శిరీషలు ప్రేమించుకున్నారు. ఇరుకుటుంబాల ఆమోదయోగ్యంతో వివాహం కూడా చేసుకున్నారు. పెళ్లి తూతూ మంత్రంగా జరగడంతో సెప్టెంబర్ 6సాయంత్రం ఇరుకుటుంబాలు ఘనంగా రిసెప్షన్ నిర్వహించాలనుకున్నారు. అందుకు ఏర్పాట్లు కూడా చేశారు. రిసెప్షన్ ప్రారంభమైంది. బంధువుల సందడితే వేదిక సందడిగా మారింది. 

అయితే రిసెప్షన్ లో వరుడు ప్రసాద్ బంధువులు బత్తిన నూకరాజు, ప్రసాద్, వధువు శిరీష బంధువులు పులి సుధాకర్, రాజేంద్రప్రసాద్ లను హేళన చెయ్యడంతో వివాదం నెలకొంది. వివాదం కాస్త ఘర్షణకు దారితీసింది. రెండు వర్గాలుగా విడిపోయిన వారు కత్తిపోట్లతో దాడులకు దిగారు. ఈ దాడిలో వధువు బంధువులు సుధాకర్ రాజేంద్రప్రసాద్ లు గాయాలపాలయ్యారు.  

దీంతో ఆగ్రహం చెందిన సుధాకర్, రాజేంద్రప్రసాద్‌ లు తమ అనుచరులతో కలిసి నూకరాజు, ప్రసాద్‌లను వెంటాడారు. వారి భారి నుంచి తప్పించుకునేందుకు నూకరాజు, ప్రసాద్ లు గ్రామం అంతా తిరిగారు. చివరికి లోవరాజు అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లారు. అక్కడ కూడా సుధాకర్ అతని అనుచరులు రావడంతో భయంతో పెండ్లి కుమారుడు నివాసంలోకి వెళ్లి దాకున్నారు. 

పెండ్లి కుమారుడు ఇంట్లో దాకున్న నూకరాజు, ప్రసాద్ లను ఎలాగైన అంతమెుందించాలని ప్రయత్నించిన సుధాకర్, రాజేంద్రప్రసాద్‌ అతని అనుచరులు ఆ ఇంటిని చుట్టుముట్టారు.  గది తలుపులకు తాళాలు వేసి గది పక్కనే ఉన్న కిటికీలోంచి పెట్రోల్‌ బాటిళ్లు విసిరి నిప్పుపెట్టారు. దీంతో లోపల ఉన్న పర్నీఛర్‌ అంటుకుని మంటలు చెలరేగి గదిలో దాగి ఉన్న నూకరాజు, ప్రసాద్‌లు సజీవ దహనమయ్యారు. 

తమను రక్షించమంటూ నూకరాజు, ప్రసాద్ లు ఆర్తనాదాలు చేసినా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. వందలాది మంది ఉంటుండగా సుధాకర్ర రాజేంద్రప్రసాద్ లు దాడులకు పాల్పడటంతో ప్రజలు భయంతో ఇళ్లలోకి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు 144 సెక్షన్ ను అమలు చేశారు. 

 మరోవైపు హత్యకు పాల్పడ్డ నిందితులు సుధాకర్, రాజేంద్రప్రసాద్ అతని అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారిస్తున్నట్లు తెలిపారు. ప్రశాంతమైన గ్రామంలో కత్తులతో దాడి, సజీవ దహనం వంటి ఘటనలు చోటు చేసుకోవడంతో కాలనీవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 

loader