ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం గాలాయిగూడెంలో ఇద్దరు బాలురు అదృశ్యమయ్యారు. ఈ ఇద్దరి కోసం కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఆరో తరగతి చదువుతున్న యశ్వంత్, ఐదో తరగతి చదువుతున్న అభి శనివారం నాడు సాయంత్రం సైకిల్ పై  ఇంటి నుండి బయటకు వెళ్లారు. ఇంటి నుండి బయటకు వెళ్లిన ఈ ఇద్దరు కూడ బయటకు రాలేదు.

వీరిద్దరూ కూడా బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు  ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు.

యశ్వంత్ తండ్రి సురేష్. అభి తండ్రి అగస్తిన్. ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.  ఈ ఇద్దరు పిల్లలు ఎక్కడికి వెళ్లారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

పిల్లల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చిన్నారుల కోసంగా గాలింపు చర్యలు చేపట్టారు. పిల్లలు ఇంటి నుండి ఎక్కడికి వెళ్లారనే విషయమై స్థానికంగా ఉన్న సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు.