కాకినాడ: యువతిని ఎరగా చూపించి ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకొంది. హత్య జరిగిన ఆరు నెలల తర్వాత విషయం వెలుగు చూసింది.

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో గత ఏడాది డిసెంబర్ 8వ తేదీన  రామకృష్ణ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. భూ తగాదాలను పురస్కరించుకొని  యువతిని ఎరగా వేసి ఈ హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. 

రామకృష్ణకు అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ కు భూ తగాదాలు ఉన్నాయి. వీరిద్దరి మధ్య దూరపు బంధుత్వం కూడ ఉంది. అయితే రామకృష్ణను చంపాలని ప్లాన్ చేశాడు శ్రీనివాస్. రామకృష్ణను కాకినాడకు డిసెంబర్ 8వ తేదీన రప్పించాడు. 

కాకినాడకు రామకృష్ణను రప్పించేందుకు ఓ యువతిని ఎరగా వేసినట్టుగా పోలీసులు గుర్తించారు. బాధితుడిని చంపి మృతదేహాన్ని అరట్లకట్ట సమీపంలోని పంట కాల్వలో పారేశాడు.

రామకృష్ణ ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు స్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు విచారణను వేగవంతం చేశారు. 

రామకృష్ణ కాల్ డేటా ఆధారంగా విచారణ చేస్తే యువతిని ఎర వేసి రామకృష్ణను కాకినాడకు రప్పించిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. యువతిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే శ్రీనివాస్ అసలు నిందితుడిగా పోలీసులు తేల్చారు.శ్రీనివాస్ తో పాటు యుువతిపై పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.