విజయనగరం: విజయనగరం జిల్లాలో గురువారం నాడు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. 

జిల్లాలోని గజపతినగరంలోని గుడివాడ జంక్షన్ వద్ద గురువారం ఉదయం రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీసన్ సజీవ దహనమయ్యారు. పాల ట్యాంకర్ లారీని కెమికల్ లారీ ఢీకొట్టింది.దీంతో మంటలు వ్యాపించాయి.

ఈ మంటల్లో ఇద్దరు సజీవ దహనమయ్యారు.ఈ రోడ్డుు ప్రమాదంతోో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.