కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏ. కొండూరు మండలం రేపూడి తండాలో కారులో ఆడుకుంటూ ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన శ్రీనివాస్ (5), యమున (4) మరణించారు.

వీరిద్దరూ కారులో ఆడుకుంటుండగా కారు డోర్స్ లాకయ్యాయి. బయటకొచ్చేందుకు పిల్లలు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. చివరికి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. వీరి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.