చిన్నారుల అదృశ్యం వెనక మిస్టరీ: కోరిక తీర్చుకుని, ఆ తర్వాత...
అతడో కిరాతకుడు.. అభం, శుభం తెలియని ఇద్దరు బాలుర పాలిట సైకోలా మారి వారిమీద లైంగిక దాడులకు తెగబడ్డాడు. ఆ తరువాత వారిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
అతడో కిరాతకుడు.. అభం, శుభం తెలియని ఇద్దరు బాలుర పాలిట సైకోలా మారి వారిమీద లైంగిక దాడులకు తెగబడ్డాడు. ఆ తరువాత వారిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెడితే.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో పక్కపక్కనే ఉండే మెల్లంపూడి, వడ్డేశ్వరం గ్రామాల్లో నెల రోజుల తేడాలో ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. ఓ బాలుడు అదృశ్యమైన రెండో రోజే విగతజీవిగా దొరకడంతో తాడేపల్లి పోలీసులు ఈ రెండు కేసులను చాలెంజింగ్ గా తీసుకున్నారు.
ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి దర్యాప్తు తీవ్రం చేయడంతో నిందితుడు పట్టుబడ్డాడు. మెల్లంపూడిలో ఈ నెల 14న మధ్యాహ్నం 3 గం.లటైంలో ఇంటిబైట ఆడుకుంటున్న కుర్ర భార్గవతేజ (6) కనిపించకుండా పోయాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఆశ్రయించారు. చిన్నారి కుటుంబ సభ్యులతో పాటు అదే గ్రామానికి చెందిన గోపయ్య అలియాస్ గోపీ(19) కూడా వెతుకుతున్నట్టుగా హంగామా చేశాడు.
అయితే గోపీ తీరుపై అనుమానించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అతను చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్ అయ్యారు. ఇంటిముందు ఆడుకుంటున్న భార్గవ్ తేజ్ కు మాయమాటలు చెప్పి, పక్కనే ఉన్న పంటపొలాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలుడి చేతులు, కాళ్లు కట్టేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత చిన్నారిని తీవ్రంగా కొట్టి హత్య చేసినట్లు గోపీ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.
అంతటితో ఆగకుండా బాలుడి మృతదేహం కాళ్లు, చేతుల్ని విరిచేసి, ముఖాన్ని గాయపర్చి ఇంటివెనకున్న అరటి తోటలో పడేసినట్టు చెప్పాడు. ఈ నేపథ్యంలో నిందితుడిని గురువారం ఘటనా స్థలానికి తీసుకువెళ్లి నేరం జరిగిన తీరును పోలీసులు సీన్ రీకన్ స్ట్రక్షన్ చేసినట్టు సమాచారం.
గోపీ ఆకృత్యం ఇది మొదటిది కాదు ఫిబ్రవరి 11న వడ్డేశ్వరం గ్రామానికి చెంది బండి మరియదాసు, మీనాక్షి కుమారుడు బండి అఖిల్ (8) మధ్యాహ్నం 3 గం.లటైంలో ఇంటిబైట ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడు అఖిల్ ఆడుకుంటూ వెళ్లి బకింగ్‌హామ్ కెనాల్‌లో పడిపోయి ఉంటాడనుకుని పోలీసులు, బంధువులు విస్తృతంగా గాలించినా ప్రయోజనం లేకపోయింది.
భార్గవతేజ అదృశ్యమైన తీరు, అఖిల్ అదృశ్యమైన తీరు ఒకేలా ఉండడంతో పోలీసులు గోపీని గట్టిగా నిలదీయగా అఖిల్ ని కూడా తనే చంపానని ఒప్పుకున్నాడు. అఖిల్ కు కూడా మాయమాటలు చెప్పి వెంటబెట్టుకుని వెళ్లి లైంగికవాంఛ తీర్చుకుని, హత్య చేసినట్టు విచారణలో ఒప్పుకున్నాడు.
నిందితుడు గోపీలో 14యేళ్ల వయసునుండే సైకో మనస్తత్వం అని.. అప్పుడే తన స్నేహితుడిని సెకండ్ షో సినిమాకి తీసుకెళ్లి ఇదే తరహాలో హత్య చేసినట్టు తెలుస్తోంది. సినిమా మధ్యలో స్నేహితుణ్ణి బయటకు తీసుకొచ్చిన గోపీ అతడిపై లైంగిక దాడి చేసి చంపి, మృతదేహాన్ని రేవేందర్రపాడు బ్రిడ్జి నుంచి బకింగ్ హామ్ కెనాల్ లో పడేసినట్లు గ్రామస్తులు చెబుతుంటారు.
అప్పట్లో కాలనీ వాసులంతా జరిగిందేదో జరిగిపోయింది కేసుల వరకు ఎందుకు పిల్లాడి భవిష్యత్ నాశనం చేయడమెందుకు అని చనిపోయిన బాలుడి తండ్రిని బుజ్జగించడంతో అప్పట్లో కేసు నమోదు కాలేదనే ప్రచారం ఉంది.
గోపీనే కాదు గోనీ తండ్రిది కూడా నేర ప్రవృత్తేనని గ్రామస్తులు చెబుతున్నారు. అతడు మొదటి భార్యను హత్య చేసిన కేసులో 14 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి వచ్చాక మరో మహిళను వివాహం చేసుకన్నాడు, కాగా నిందితుడు గోపీని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చూపే అవకాశం ఉంది.