Asianet News TeluguAsianet News Telugu

రఘురామ vs విజయసాయిరెడ్డి.. ట్వీట్లతో దుమ్మెత్తిపోసుకున్న వైసీపీ ఎంపీలు

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి (vijayasai reddy), ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మధ్య ఎన్నోసార్లు మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఇద్దరూ ట్వీట్లతో దుమ్మెత్తి పోసుకున్నారు. 

tweets war between ysrcp mps raghu rama krishnam raju and vijayasai reddy
Author
Amaravathi, First Published Jan 21, 2022, 4:00 AM IST

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి (vijayasai reddy), ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మధ్య ఎన్నోసార్లు మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఇద్దరూ ట్వీట్లతో దుమ్మెత్తి పోసుకున్నారు. 

'జీవితాన్ని రొచ్చు చేసుకున్నావు కదా రాజా! ఏదో ప్రాపర్టీనో, వాహనాలనో అద్దెకు ఇచ్చినట్టు... నిన్ను నువ్వే బాడుగకు ఇచ్చుకుని పెయిడ్ మైక్ అయ్యావు. లెక్క పంపిస్తే ట్వీట్లు, స్టేట్ మెంట్లు ఏదైనా చేస్తావు. ఇంత నీచపు జీవితం భారంగా లేదూ? గెలిపించిన ప్రజలను తాకట్టు పెట్టేశావు కదా!' అని విజయసాయి వ్యాఖ్యానించారు.

 

 

 

విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు రఘురాజు కూడా ఘాటుగా బదులిచ్చారు. 'అవునా? నా జీవితం నీకు, ఏ1కి భారంగా ఉందనే కదా నన్ను కూడా కడతేర్చాలనుకుంటున్నారు... పాపం వివేకానందరెడ్డి లా! ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి, సొమ్ములు దోచేస్తున్న మిమ్మల్ని రొచ్చులో తొక్కే రోజు దగ్గర పడింది మిస్టర్ ఏ2!' అని సెటైర్ వేశారు.

కాగా..  జార్ఖండ్ కు చెందిన వారితో తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని Raghurama krishnam raju సంచలన ఆరోపణలు చేశారు. గత శుక్రవారం నాడు న్యూఢిల్లీలో Ycp రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు  మీడియాతో మాట్లాడారు. ఈ విషయమై అన్ని వివరాలతో ప్రధాని Narendra modiకి లేఖ రాయనున్నట్టుగా రఘురామకృష్ణం రాజు తెలిపారు. గుంటూరులో tdp నేత చంద్రయ్యను హత్య చేయడాన్ని రఘురామకృష్ణం రాజు ప్రస్తావిస్తూ వ్యక్తులు నచ్చకపోతే వ్యక్తులను, వ్యక్తులను జగన్ తీసేస్తారన్నారు.  Bjp ఎంపీ Bandi Sanjay ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ విషయంలో స్పందించినట్టుగానే AP Cid చీఫ్ Sunil kumar పై తాను ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ పై స్పందించాలని Loksabha speaker  Om birla కోరారు.

జగనన్న గోరుముద్ద పథకం రాష్ట్రంలో కొనసాగదన్నారు. ఈ విషయమై తాను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి రాసిన లేఖకు ఆమె స్పందించారని రఘురామకృష్ణం రాజు చెప్పారు.  Chiranjeeviని అల్లరి చేసేందుకే ఓ పత్రికలో Rajyasabhaకు పంపుతున్నట్టుగా కథనం రాయించారని వైసీపీపై రఘురామకృష్ణం రాజు విమర్శలు చేశారు. చిరంజీవి చెప్పకపోతే సినీ పరిశ్రమలోని సమస్యలు సీఎం జగన్ కు తెలియవా  అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ప్రభుత్వంపై పోరాడుతున్న Pawan kalyan కళ్యాణ్ కు చిరంజీవి మద్దతివ్వాలని ఆయన కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios