తుని మాజీ ఎమ్మెల్యే  అశోక్ బాబు జనసేనలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత కొంతకాలంగా ఆయన జనసేనలో చేరనున్నట్లు వార్తలు వస్తూనే  ఉన్నాయి. కాగా.. వాటిని ఆయన ఇప్పుడు నిజం చేశారు.  ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో అశోక్  బాబు.. జనసేన పార్టీ నుంచి తుని నియోజకవర్గానికి పోటీచేయడం ఖాయమని తెలుస్తోంది.

ప్రజాపోరాట యాత్ర సన్నాహ సమావేశం తునిలో నిర్వహించిన అనంతరం ఆ పార్టీ నేతలు కందుల దుర్గేష్‌, పంతం నానాజీ తదితరులు అశోక్‌బాబు ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. దానికి సమ్మతించిన ఆయన ముహూర్తం చూసుకుని పార్టీలో చేరతానని వారికి హామీ ఇచ్చారు. దీంతో జనసేన పార్టీ శ్రేణుల్లో అనందోత్సాహాలు వెల్లివిరిశాయి. 

ఇప్పటి వరకూ సరైన అభ్యర్థి కోసం అన్వేషిస్తుండగా అశోక్‌బాబు హామీ వారికి కొండంత బలాన్ని చేకూర్చిందని పలువురు ఆనందం వ్యక్తం చేశారు. తూర్పు సెంటిమెంట్‌తో తుని నుంచే తమ పార్టీ అభ్యర్థి విజయం సాధిండం ఖాయమని ఆపార్టీ నాయకులు వ్య క్తం చేశారు.