ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి, వైసిపిల మధ్య హోరాహోరీ వుండే నియోజకవర్గాల్లో తుని ఒకటి. ఆవిర్భావం నుండి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా వున్న ఆ నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. గత రెండుసార్లుగా టిడిపి కోటపై వైసిపి జెండా ఎగిరింది. మరి ఈసారి తుని ప్రజల తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

తుని రాజకీయాలు :

తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు 1983 నుండి 2009 వరకు తుని ఎమ్మెల్యేగా కొనసాగారు. వరుసగా ఆరుసార్లు (1983,1985,1989, 1994,1999,2004) గెలిచి రికార్డు సృష్టించారు యనమల కీలక మంత్రిత్వ శాఖలు చేపట్టారు. ఇలా దాదాపు రెండు దశాబ్దాలపాటు తునిలో యనమల ఎదురులేకుండా పోయింది.  

అయితే 2009 నుండి తునిలో యనమల కుటుంబానికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నారు. 2009 లో యనమల రామకృష్ణుడు... 2014, 19 ఎన్నికల్లో ఆయన సోదరుడు కృష్ణుడు తుని నుండి పోటీచేసి ఓడిపోయారు. దీంతో ఈసారి ఎలాగైనా తునిని గెలుచుకోవాలన్న పట్టుదలతో వున్న యనమల తన కూతుర్ని బరిలోకి దింపారు. 

ఇదిలావుంటే తుని రాజకీయాల్లో గత పదేళ్లుగా చాలా మార్పులు వచ్చాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా వైసిపిని బలోపేతం చేస్తూవచ్చారు. దీంతో ఈసారి తునిలో టఫ్ ఫైట్ వుండనుంది. 

తుని నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. తొండంగి
2. కోటనందూరు 
3. తుని
 
తుని అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) ‌-  2,13,055

పురుషులు -  1,06,028
మహిళలు ‌-  1,07,009

తుని అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

తుని నుండి మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా బరిలోకి దిగనున్నారు. వైసిపి అధికారికంగా ప్రకటించపోయినా ఇప్పటికే ఆయన ప్రచారాన్ని ప్రారంభించుకున్నారు. దీన్నిబట్టి ఆయన పోటీచేయడం ఖాయంగా కనిపిస్తోంది. 

టిడిపి అభ్యర్థి :

మాజీ మంత్రి, సీసియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు తన వారసురాలిని రాజకీయ రంగప్రవేశం చేయిస్తున్నారు. తుని నుండి యనమల దివ్య పోటీ చేయనున్నారు. ఈ మేరకు టిడిపి తొలి జాబితాలోనే ఆమె పేరు ప్రకటించారు. 
  
తుని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;

 

తుని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు - 2024

తుని నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ గెలుపొందింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజాపై టీడీపీ యనమల దివ్య విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో దాడిశెట్టి రాజా    82029 (43.3%) ఓట్లు సాధించగా, యనమల దివ్య 97206 (51.31%) ఓట్లు సాధించారు. 
 
తుని అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు -  1,77,375 (83 శాతం)

వైసిపి - దాడిశెట్టి రాజా - 92,459 (52 శాతం) - 24,016 ఓట్ల మెజారిటీతో విజయం

టిడిపి - యనమల కృష్ణుడు - 68,443 (38 శాతం) - ఓటమి 
 
తుని అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు -   1,59,970 (80 శాతం)

వైసిపి  - దాడిశెట్టి రాజా - 84,755 (52 శాతం) -18,573 ఓట్ల మెజారిటీతో విజయం

టిడిపి  - యనమల కృష్ణుడు - 66,182 (41 శాతం) - ఓటమి