Asianet News TeluguAsianet News Telugu

తిరుమల ఆలయంపై డ్రోన్.. పోలీసులకు టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు

తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ దృశ్యాలకు సంబంధించి పోలీసులకు టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

ttd vigilance complaint to police department for tirumala temple drone videos
Author
First Published Jan 21, 2023, 9:18 PM IST

తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన డ్రోన్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వ్యవహారం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరణ్ అనే వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్‌ను ఎగురవేశాడు. అనంతరం ఆ దృశ్యాలను ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో చేశారు చేశాడు. టీటీడీ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఐపీసీ సెక్షన్ 447 కింద కేసు నమోదు చేశారు. 

Also REad: ఇన్‌స్టాగ్రామ్‌లో తిరుమల శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్స్, ఉలిక్కిపడ్డ టీటీడీ.. ఈవో స్పందన ఇదే

కాగా.. సోషల్ మీడియాలో శ్రీవారి ఆలయానికి సంబంధించి డ్రోన్ షాట్ల వ్యవహారం శుక్రవారం వైరల్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఐకాన్ అనే ఖాతా నుంచి వీడియో అప్‌లోడ్ అయ్యింది. డ్రోన్లు ఎగురవేసినా టీటీడీ విజిలెన్స్ గుర్తించకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులు డ్రోన్ షాట్స్ తీసినట్లుగా తెలుస్తోంది.మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. ఇది గూగుల్ లేదా త్రీడి ఇమేజ్ అయి వుంటుందన్నారు. ఇటీవల ఆలయం వెనుక వైపు ఏర్పాటు చేసిన క్రేన్ విజువల్స్ లేకపోవడంతో ఈ వీడియో ఇప్పటివి కావన్నారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారని ఆయన చెప్పారు. తిరుమలలో డ్రోన్ కెమెరాలకు అనుమతి లేదని ధర్మారెడ్డి పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios