సిఫారసు లేఖలతో శ్రీవారి వీఐపీ బ్రేక్ టికెట్లు.. బ్లాక్‌లో విక్రయం, విజిలెన్స్ వలలో ఎండోమెంట్ ఉద్యోగి
సిఫారసు లేఖలపై వీఐపీ దర్శన టికెట్లను విక్రయిస్తున్న ఎండోమెంట్ సెల్ ఉద్యోగి శ్రీహరిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇతను నందిగామ ఎమ్మెల్యే సిఫార్సు లేఖలపై 6 వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను సంపాదించాడు.

అధికారులు ఎంతగా కఠిన చర్యలు తీసుకుంటున్నా... పోలీసులు నిఘా పెడుతున్నా తిరుమల శ్రీవారి ఆలయంలో అక్రమార్కులు పట్టుబడుతూనే వున్నారు. తాజాగా టీటీడీ విజిలెన్స్‌కు మరో అక్రమార్కుడు చిక్కాడు. సిఫార్సు లేఖలపై పొందే వీఐపీ దర్శన టికెట్లను అతను అమ్ముకుంటున్నట్లుగా దర్యాప్తులో తేలింది. వాటిని అధిక రేట్లకు విక్రయిస్తూ ఎండోమెంట్ సెల్ ఉద్యోగి శ్రీహరి విజిలెన్స్‌కు చిక్కాడు.
ఇతను గతంలో టీటీడీ మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ ఆఫీసులో పనిచేశాడు. అయితే అక్రమాలకు అలవాటు పడి ప్రధాన పోస్టులోనే ఉద్యోగం ఉండేలా శ్రీహారి పైరవీలు చేసినట్లుగా గుర్తించారు. నందిగామ ఎమ్మెల్యే సిఫార్సు లేఖలపై 6 వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను సంపాదించాడు. వీటిని రూ.18 వేలకు విక్రయించాడు. ఈ నేపథ్యంలో అతనిపై నిఘా పెట్టిన టీటీడీ విజిలెన్స్ శ్రీహారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. శ్రీహరి బ్యాంక్ ఖాతాల్లో భారీగా నగదు డిపాజిట్ అయినట్లు గుర్తించారు. ఎండోమెంట్ సెల్ ద్వారా కూడా దర్శన టికెట్లు పొందాడు శ్రీహరి.
ALso REad:టికెట్లు వుంటేనే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం.. ఈసారి స్ట్రిక్ట్‌గా : తేల్చిచెప్పిన టీటీడీ
ఇకపోతే.. టికెట్లు వున్న భక్తులకే తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని చెప్పింది టీటీడీ . మొత్తం ఏడున్నర లక్షల మందికి అవకాశం వుంటుందని వెల్లడించింది. పదిరోజుల పాటు శ్రీవారి ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తామని తెలిపింది. జనవరి 2 నుంచి 11 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు వుంటాయని స్పష్టం చేసింది. రోజుకు 25 వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ టికెట్లు జారీ చేస్తామని.. తిరుపతిలోని 9 ప్రాంతాల్లో రోజుకు 50 వేల చొప్పున సర్వ దర్శన టికెట్లు జారీ చేస్తామని వెల్లడించింది. శ్రీవారి ట్రస్ట్ దాతలకు ఆన్‌లైన్ ద్వారా టికెట్లు జారీ చేస్తామని.. మహాలఘు ద్వారానే అందరికీ స్వామివారి దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అలాగే డిసెంబర్ 29 నుంచి జనవరి 3 వరకు తిరుమలలో అడ్వాన్స్ గదుల బుకింగ్‌ను నిలిపివేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భక్తులకు సీఆర్‌వో వద్దనే గదులు కేటాయిస్తామని ధర్మారెడ్డి పేర్కొన్నారు