Asianet News TeluguAsianet News Telugu

టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ కీలక నిర్ణయాలు

అథారిటీ చైర్మన్‌ జవహర్‌రెడ్డి అధ్యక్షతన తొలిసారి ఈ సమావేశం జరిగింది. తిరుమల అభివృద్ధి పనుల నిధుల కేటాయింపుపై సమావేశంలో చర్చించారు

TTD specified authority key decisions
Author
Hyderabad, First Published Aug 6, 2021, 3:03 PM IST

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం స్పెసిఫైడ్‌ అథారిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. బర్డ్‌ చిన్నపిల్లల ఆస్పత్రిలో వైద్య పరికరాల కొనుగోలుకు రూ.2.3 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. 

ఇక నెల్లూరు జిల్లాలో సీతారామస్వామి ఆలయ నిర్మాణానికి రూ.80 లక్షలు మంజూరుకు నిర్ణయం తీసుకుంది. త్రిదండి చినజీయర్‌ స్వామి సూచనల మేరకు 10 ఆలయాల పునర్నిర్మాణం కోసం రూ.9 కోట్లు వినియోగించాలని చర్చించింది. 

2021-22 ఏడాదికి 12 లక్షల డైరీలు, 8 లక్షల క్యాలండర్లు, 2 లక్షల చిన్న డైరీలు ముద్రించాలని, గ్రీన్‌ ఎనర్జీ వినియోగం కోసం 35 ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుకు నిర్ణయించింది. అథారిటీ చైర్మన్‌ జవహర్‌రెడ్డి అధ్యక్షతన తొలిసారి ఈ సమావేశం జరిగింది. తిరుమల అభివృద్ధి పనుల నిధుల కేటాయింపుపై సమావేశంలో చర్చించారు

Follow Us:
Download App:
  • android
  • ios