Asianet News TeluguAsianet News Telugu

తిరుమల శ్రీవారికి కాసుల వర్షం.. రికార్డులు సృష్టిస్తోన్న హుండీ , జూలై నెలలో రూ.139.45 కోట్ల ఆదాయం

జూలై నెలలో శ్రీవారికి రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. మొదటి సారిగా జూలై నెలలో శ్రీవారికి రూ.139.45 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. ఇదే సమయంలో మే నెలలో 130.5 కోట్లు వచ్చింది. తద్వారా వరుసగా ఐదో నెలలో ఆదాయం రూ.100 కోట్లు దాటింది. 

ttd got huge amount of hundi income in july
Author
Tirupati, First Published Jul 31, 2022, 9:12 PM IST

జూలై నెలలో శ్రీవారికి రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. మొదటి సారిగా జూలై నెలలో శ్రీవారికి రూ.139.45 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. ఇదే సమయంలో మే నెలలో 130.5 కోట్లు వచ్చింది. తద్వారా వరుసగా ఐదో నెలలో ఆదాయం రూ.100 కోట్లు దాటింది. 

ఇకపోతే.. ఈ నెలలో కేవలం 21 రోజుల్లోనే శ్రీవారి హుండీ ద్వారా రూ.100 కోట్ల 75 లక్షల ఆదాయం వచ్చింది. జూలై నెలలో టీటీడీ (ttd) చరిత్రలోనే అత్యధిక స్థాయిలో ఆదాయం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు గత మే నెలలో రూ.130 కోట్లే అత్యధిక హుండీ ఆదాయం వచ్చింది. ఈ నేపథ్యంలో మొదటిసారి శ్రీవారికి రూ.140 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం వుందని అధికారులు భావిస్తున్నారు. 

Also Read:తిరుమల శ్రీవారికి కాసుల వర్షం.. రికార్డులు సృష్టిస్తోన్న హుండీ , 21 రోజుల్లోనే 100 కోట్ల పైచీలుకు ఆదాయం

కాగా.. ఈ నెల 5న భక్తులు శ్రీవారికి రూ.6.18 కోట్ల కానుకల్ని హుండీలో సమర్పించుకున్నారు. ఇలా ఒక్క రోజులో 6 కోట్ల పైచీలుకు ఆదాయం రావడం తిరుమల చరిత్రలో ఇది రెండోసారి. గతంలో 2018 జూలై 26న రూ.6.28 కోట్ల కానుకల్ని హుండీలో వేశారు భక్తులు. గడిచిన రెండేళ్లుగా కరోనా కారణంగా తిరుమలకు రాలేని భక్తులు.. ఇప్పుడు పరిస్ధితులు కుదుటపడటంతో పోటెత్తుతున్నారు. ఈ కారణం చేతనే హుండీ ఆదాయం రికార్డులు సృష్టిస్తోందని అధికారులు అంటున్నారు. ఇకపోతే వేసవి సెలవుల కారణంగా గడిచిన నాలుగు నెలలుగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 కోట్లు దాటుతోన్న సంగతి తెలిసిందే. ఇదే జోరు కొనసాగితే మాత్రం ఈ ఏడాది శ్రీవారి ఆదాయం రూ.1,500 కోట్లు దాటుతుందని టీడీడీ అంచనా వేస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios