టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌తో పాటు మరికొందరు అధికార్లపై సంచలన ఆరోపణలు చేశారు. ఉదయం తిరుమల అన్నమయ్య భవన్‌లో పుట్టా అధ్యక్షతన టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది.

సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే బోర్డ్ సభ్యుడు చల్లా బాబు తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఈవో సింఘాల్‌కు సమర్పించారు. ఆ వెంటనే సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో సమావేశం రసాభాసగా మారింది.

దీంతో ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌తో పాటు జేఈవో శ్రీనివాసరాజు బయటకు వచ్చేశారు. దీనిపై ఛైర్మన్ పుట్టా తీవ్ర అసహనం చేశారు. అధికారులు సమావేశాన్ని బహిష్కరించారని.. ఎంతసేపు వేచి చూసినా వారు రాలేదని తీవ్రంగా వ్యాఖ్యానించారు.

గత ప్రభుత్వం తమను నియమించిందని, ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రభుత్వం బోర్డును రద్దు చేస్తే పదవులు వదులుకుంటామన్నారు. అయితే స్వచ్ఛందంగా మాత్రం రాజీనామాలు చేయబోమని ఆయన స్ఫష్టం చేశారు.