ప్రత్యేక హోదా కోసం త్రినాథ్ అనే యువకుడి ఆత్మహత్య

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 31, Aug 2018, 6:57 PM IST
trinath commits suicide for special status to Andhrapradesh
Highlights

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా  ఇవ్వాలని కోరుతూ ఓ యువకుడు శుక్రవారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా  ఇవ్వాలని కోరుతూ ఓ యువకుడు శుక్రవారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  విశాఖ జిల్లాలోని నక్కపల్లి మండలంల కాగిత టోల్ గేట్ వద్ద ఉన్న సెల్ టవర్‌కు ఉరేసుకొని  దొడ్డి త్రినాథ్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడంతో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు  త్రినాథ్  సూసైడ్ నోట్ రాశాడు.  ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ఉద్దేశించి ఆయన లేఖ రాశాడు.

ప్రత్యేక హోదా కోసం అందరూ  ముందుకు రావాలని  ఆయన ఆ లేఖలో కోరాడు.  అమ్మా నన్ను క్షమించు.. నీకు ఇచ్చిన మాట తప్పుతున్నానని  అని ఆ లేఖలో పేర్కొన్నాడు.  తన కుటుంబసభ్యులను ప్రస్తావించి తనను క్షమించాలని కోరాడు.

ఈ ఇంటిని చూసుకోవాలని బావను ఆ లేఖలో కోరాడు.  ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు చేసుకోకూడదని  రాజకీయ పార్టీలు,ప్రజాసంఘాలు కోరుతున్నాయి. కానీ, ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు.

loader