విశాఖ జిల్లా అరకులో దారుణం చోటుచేసుకుంది. ఓ గిరిజన యువతిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం  ఆమె తలపై బండరాయితో మోది హత్య చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే... అరకుకు చెందిన మహేష్ అనే వ్యక్తికి వివాహమై... ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ గత కొంతకాలంగా... అదే ప్రాంతానికి చెందిన పుష్ప అనే యువతి ని ప్రేమ పేరిట వేధించేవాడు.

తనను ప్రేమిస్తున్నానని... పెళ్లి చేసుకోవాలని వేధించేవాడు. యువతి నిరాకరించడంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. పథకం ప్రకారం ఆమెను అంతమొందించాలని అనుకున్నాడు. శుక్రవారం రాత్రి మాట్లాడాలని చెప్పి పుష్ప ఇంటికి దూరంగా తీసుకువెళ్లాడు. అక్కడ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బండరాయితో మోది హత్య చేశాడు.

ఉదయం యువతి శవమై కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మహేష్ పైనే అనుమానం ఉందంటూ కుటుంబసభ్యులు చెప్పడంతో... అతనిని విచారించగా నేరం అంగీకరించాడు. అతనిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని యువతి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.