తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ట్రైన్ ఢీ కొట్టి టూవీలర్ తునాతునకలయ్యింది. రాజమండ్రి తాడితోట రైల్వే గేట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని ఓ బైక్ ముక్కలు ముక్కలయ్యింది.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ట్రైన్ ఢీ కొట్టి టూవీలర్ తునాతునకలయ్యింది. రాజమండ్రి తాడితోట రైల్వే గేట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని ఓ బైక్ ముక్కలు ముక్కలయ్యింది.
"
రాజమండ్రిలో తాడితోట ప్రాంతం నుంచి రంభ, ఊర్వశి థియేటర్లకు వెళ్లే మార్గంలో ఉన్న రైల్వే గేట్ వద్ద రైలు వస్తుండడంతో గేట్లు వేశారు. అయితే దాన్ని పట్టించుకోకుండా టూ వీలర్ మీద ఓ యువకుడు ట్రాక్ దాటే ప్రయత్నం చేశాడు.
చివరి నిముషంలో ట్రైన్ వస్తుండడం గమనించి బైక్ మీదినుంచి దిగిపోయాడు. బైక్ పట్టాకు దగ్గరగా ఉంది. ఇంతలో స్పీడ్ గా వచ్చిన ట్రైన్ మొదట బైక్ ను పక్కకు తోసింది. ఆ తరువాత ట్రైన్ స్పీడ్ కు బైక్ తునాతునకలయ్యింది.
అయితే ఈ ప్రమాదంలో యువకుడు సెకనులో తప్పించుకున్నాడు. ఈ దృశ్యం సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది.