అమరాతి: ఈనెల 11 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం బీఏసీ మీటింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ బీఏసీ సమావేశం జరగనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. 

అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, బడ్జెట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇకపోతే గురువారం ఉదయం 9గంటలకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 

సమావేశాల తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. ఈనెల 12న అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇకపోతే గతంలో లేని విధంగా అసెంబ్లీ సమావేశాలకు ఒక రోజు ముందుగానే బీఏసీ సమావేశాన్నినిర్వహించడం విశేషం.