తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలో ఆకట్టుకున్నారు. తిరుపతిలో జరగుతున్న గంగమ్మ తల్లి జాతర సందర్భంగా ఎంపీ ఇలా వెంకన్నలా మెరిశారు.
వైసీపీ (ysrcp) నేత, తిరుపతి ఎంపీ (tirupati mp) గురుమూర్తి (gurumurthy) శ్రీ వేంకటేశ్వర స్వామి (sri venkateswara swamy) అవతారమెత్తారు. శ్రీవేంకటేశ్వర స్వామి వేషధారణలో కనిపించిన ఆయన అందరినీ ఆకట్టుకున్నారు. తిరుపతిలో జరుగుతున్న తాతయ్య గుంట గంగమ్మ జాతరలో (gangamma jatara) ఈ దృశ్యం కనిపించింది. జాతరలో భాగంగా ఆదివారం వెంకటేశ్వర స్వామి వేషధారణలో వెళ్లిన గురుమూర్తి గంగమ్మ తల్లికి మొక్కు చెల్లించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా గురుమూర్తే ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తిరుపతి గంగమ్మ జాతరకు చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పిన గురుమూర్తి.. కోరిన కోర్కెలు తీర్చే అమ్మగా తాతయ్య గుంట గంగమ్మతల్లి జాతర రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిందని ఎంపీ పేర్కొన్నారు
"
Scroll to load tweet…
