Asianet News TeluguAsianet News Telugu

తిరుపతిలో అదృశ్యమైన ఐదుగురు విద్యార్ధులు:ఆగ్రాలో ఆచూకీ లభ్యం

ఈ నెల 9వ తేదీన అదృశ్యమైన ఐదుగురు విద్యార్ధులు ఆగ్రాలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.  వారిని రేపు సాయంత్రానికి తిరుపతికి  తీసుకువచ్చే అవకాశం ఉంది.
 

Tirupati Police found five missing students in Agra
Author
First Published Nov 13, 2022, 3:30 PM IST

తిరుపతి:ఈ నెల 9వ తేదీన అదృశ్యమైన ఐదుగురు టెన్త్ క్లాస్ విద్యార్ధుల ఆచూకీ ఆగ్రాలో లభ్యమైంది. ఈ విద్యార్ధులను తిరుపతికి తీసుకువచ్చేందుకు ప్రత్యేక పోలీస్ బృందం ఆగ్రాకు వెళ్లింది .ఈ నెల 9వ  తేదీన విద్యార్ధులు  స్టడీ  అవర్ కు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. స్టడీ అవర్ నుండి ఇంటికి వెళ్తున్నట్టుగా  సీసీటీవీల్లో పోలీసులు గుర్తించలేదు. కానీ ఇళ్లకుచేరలేదు. దీంతో విద్యార్ధుల పేరేంట్స్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. విద్యార్ధుల స్నేహితులను కూడా  పోలీసులు  ప్రశ్నించారు. నగరంలోని   పలు సీసీటీవీ పుటేజీలను కూడా పోలీసులు  పరిశీలించారు.

తమిళనాడు,బెంగుళూరు నగరాల్లో కూడా  విద్యార్ధుల కోసం  పోలీసు బృందాలు వెళ్లాయి.కానీ ఫలితం దక్కలేదు.అయితే  ఇవాళ  మాత్రం విద్యార్ధులు ఆగ్రాలో ఉన్నట్టుగా గుర్తించారు.తిరుపతిలోని  ప్రైవేట్ స్కూల్ లో విద్యార్ధులు చదువుకుంటున్నారు. అదృశ్యమైన ఐదుగురు  విద్యార్ధుల్లో నలగురు టెన్త్ క్లాస్ విద్యార్ధులు.,ఒకరు తొమ్మిదో తరగతి  విద్యార్ధి.విద్యార్ధుల పేరేంట్స్ తిరుపతి నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా  పోలీసులు విద్యార్ధుల కోసం  గాలింపు  చర్యలు చేపట్టారు.తాజ్ మహల్ ను చూసేందుకు విద్యార్ధులు వెళ్లారా లేదా విద్యార్ధులను ఎవరైనా తీసుకెళ్లారా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.విద్యార్ధుల  ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా విద్యార్ధులు  ఆగ్రాలో ఉన్నట్టుగా  పోలీసులు గుర్తించారు.

Follow Us:
Download App:
  • android
  • ios