తిరుపతి బైపోల్: బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ ఆస్తులివే...
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా పోటీలో ఉన్న రిటైర్డ్ ఐఎఎస్ అధికారిణి రత్నప్రభ తన అఫిడవిట్ లో తనకు ఉన్న ఆస్తుల వివరాలను ప్రకటించింది.
తిరుపతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా పోటీలో ఉన్న రిటైర్డ్ ఐఎఎస్ అధికారిణి రత్నప్రభ తన అఫిడవిట్ లో తనకు ఉన్న ఆస్తుల వివరాలను ప్రకటించింది.
రూ. 25 కోట్ల విలువ గల ఆస్తి ఉన్నట్లు ప్రకటించారు. గతంలో కర్ణాటక చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆమె ప్రకటించారు.
2019-20 మధ్యకాలంలో తన ఆదాయం రూ. 39.5 లక్షలుగా పేర్కొన్నారు. ఇక తన తల్లి నుంచి సంక్రమించిన బంగారు ఆభరణాల విలువ రూ. 52 లక్షలు అని అఫిడవిట్ లో తెలిపారు.
రత్నప్రభ ఆస్తి వివరాలు
మొత్తం ఆస్తి విలువ:రూ. 25 కోట్లు
రత్నప్రభ సొంత ఆస్తులు- రూ. 19.7 కోట్లు
బ్యాంకు డిపాజిట్ల విలువ- రూ. 2.8 కోట్లు
బంగారు ఆభరణాల విలువ- రూ. 52 లక్షలు
చరాస్తుల విలువ- రూ. 3.5 కోట్లు
భూమి, భవనాలు, ఇళ్ల స్థలాలు, ఇతర స్థిరాస్తుల విలువ- రూ. 16.2 కోట్లు.
ఇక తిరుపతి ఉప ఎన్నిక బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ డాక్టర్ చింతా మోహన్ తనకు ఆస్తులు లేవని ప్రకటించారు. అదే విధంగా టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి పనబాక లక్ష్మి(భర్త క్రిష్ణయ్యతో కలిసి ఉమ్మడి ఆస్తి) తనకు రూ. 10 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఎం. గురుమూర్తి తనకు రూ. 40 లక్షల ఆస్తి ఉన్నట్లు ప్రకటించారు.