Asianet News TeluguAsianet News Telugu

పెద్దిరెడ్డి పుంగనూరు వీరప్పన్... నారాలోకేష్ ఫైర్

మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. పుంగనూరు వీరప్పన్ పెద్దిరెడ్డిని విమర్శించారు. ఎర్రచందనం చెట్లను నరికేస్తున్నట్టే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

tirupati by poll : nara lokesh fires on peddireddy - bsb
Author
Hyderabad, First Published Apr 17, 2021, 2:45 PM IST

మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. పుంగనూరు వీరప్పన్ పెద్దిరెడ్డిని విమర్శించారు. ఎర్రచందనం చెట్లను నరికేస్తున్నట్టే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బయటి వ్యక్తులకు తీసుకొచ్చి పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించారు. పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ కల్యాణమండపంలో 5వేలమంది మకాం వేశారని పేర్కొన్నారు. 

దొంగఓట్లు వేయడానికి వెల్తున్న వారిని టీడీపీ నేతలు అడ్డుకున్నారని తెలిపారు. వైసీపీ రిగ్గింగ్, దొంగ ఓట్లతో గెలవాలని చూస్తోందన్నారు. ఈసీ స్పందించి మంత్రులను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఇదిలా ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తిరుపతి ఉపఎన్నిక నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. శనివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ అరాచకాలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు.

దొంగఓట్ల కోసం వేల మందిని తిరుపతిలో దించారు... చంద్రబాబు ఆరోపణలు...

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో.. ఉప ఎన్నిక పోలింగ్‌ రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కేంద్ర బలగాల సాయంతో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఉన్న ఆధారాలను పరిశీలించి మిగతా చోట్ల రీపోలింగ్‌ పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

వైసీపీ నేతలు  తిరుపతి ఉపఎన్నికకు  వందల బస్సుల్లో దొంగ ఓటర్లను తరలించారని టీడీపీ అధినేత ఆరోపించారు. పోలీసులు సరిహద్దులు మూసివేసి తనిఖీలు చేసి పంపాల్సిందని.. ఎందుకు చెక్‌పోస్టులను ఎత్తివేశారు? అని నిలదీశారు.

తిరుపతిలోకి భారీగా బయటి వ్యక్తులు వచ్చారని.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్వెన్షన్‌ సెంటర్‌లో వేల మందిని ఉంచితే.. పోలీసులు నిద్రపోతున్నారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. బీజేపీ నేత శాంతారెడ్డి దొంగ ఓటర్లను పట్టుకున్నారని.. అలాగే దొంగ ఓటర్లను పట్టిస్తే టీడీపీ నాయకులను అరెస్ట్‌ చేస్తారా? అని ఆయన నిలదీశారు.

బందిపోట్లను మైమరిపించేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని... తండ్రి పేరు చెప్పలేని వాళ్లు దొంగ ఓటర్లు కాక మరేంటి? అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మంత్రులు బరితెగించి తిరుపతిలో ఉంటే.. అధికార పార్టీకి ఊడిగం చేస్తామన్నట్లు పోలీసుల తీరుందని చంద్రబాబు మండిపడ్డారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios