Asianet News TeluguAsianet News Telugu

టీటీడీకి ఒక్కరోజే రూ. పదికోట్ల విరాళాలు..

తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళాలు వెల్లువెత్తాయి. ఒక్కరోజూ రూ. పదికోట్ల విరాళాలు అందాయి. వీటిని టీటీడీకి అనుబంధంగా పనిచేసే అనేక ట్రస్టులకు దాతలు విరాళంగా అందించారు. 

Tirumala Tirupati Devasthanams receives single-day donation of Rs 10 crore, Andhra Pradesh
Author
Hyderabad, First Published Jun 7, 2022, 8:57 AM IST

తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒకే రోజు రూ. 10కోట్ల విరాళాలు అందాయి. వివిధ వ్యక్తులు, సంస్థల నుండి వివిధ ట్రస్ట్‌ల  నిర్వహణ కోసం ఒకే రోజు 10 కోట్ల విరాళాలు వచ్చాయి. తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన గోపాల్ బాల కృష్ణన్ అనే ఒక్క భక్తుడే ఏకంగా 7 కోట్ల విరాళాలు అందించారు. ఆయన ఈ విరాళాల్ని టీటీడీ నిర్వహిస్తున్న ప్రాణదాన ట్రస్ట్, గోసంరక్షణ ట్రస్ట్, బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది డిసేబుల్డ్ (పక్షి), వేదపరిరక్షణ ట్రస్ట్, సర్వ శ్రేయస్ ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC).అన్నప్రసాదం ట్రస్ట్‌లకు ఒక్కోదానికి ఒక్కో కోటి చొప్పున విరాళంగా ఇచ్చారు. 

తిరునెల్వేలికి చెందిన మూడు కంపెనీల నుండి 1 కోటి చొప్పున ఇతర విరాళాలు వచ్చాయి. M/s A-Star Testing & Inspection Pvt Ltd శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్‌కు 1 కోటి విరాళం అందించగా, బాలకృష్ణ ఇంధన కేంద్రం శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్‌కు 1 కోటి విరాళం అందించగా, సీ హబ్ ఇన్‌స్పెక్షన్ సర్వీసెస్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్‌కు 1 కోటి విరాళం అందించింది.
ఈ మొత్తాన్ని దాతలు డీడీల రూపంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios