ఏపీలో కరోనా మృత్యుఘోష: 44కు చేరిన మరణాలు, కేసులు 1930
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాలు కూడా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో తాజాగా మరో ముగ్గురు కోవిడ్ -19తో మరణించారు. కాగా, కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 1930కు చేరుకున్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో మరో ముగ్గురు కోవిడ్ -19 బారిన పడి మరణించారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు మరణించారు. దీంతో కరోనా వైరస్ మరమాల సంఖ్య 44కు చేరుకుంది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 15 మంది మరణించగా, కృష్ణా జిల్లాలో 13 మంది మరణించారు. గుంటూరు జిల్లాలో 8 మంది మృత్యువాత పడ్డారు.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా గత 24 గంటల్లో మరో 43 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1930కి చేరుకుంది. కృష్ణా జిల్లాలో కోరనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా గత 24 గంటల్లో 16 కేసులు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా కొత్త కేసులేమీ లేని చిత్తూరు జిల్లాలో గత 24 గంటల్లో 11 కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 3 కేసులు, గుంటూరు జిల్లాలో 2 కేసులు రికార్డయ్యాయి. కర్నూలు జిల్లాలో 6 కేసులు, విశాఖపట్నం జిల్లాలో 5 కేసులు నమోదయ్యాయి.
తూర్పు గోదావరి, కడప, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలో గత 24 గంటల్లో కేసులేమీ నమోదు కాలేదు. కర్నూలు జిల్లా 553 కేసులతో ఎప్పటిలాగే అగ్రస్థానంలో కొనసాగుతుండగా, 376 కేసులతో గుంటూరు జిల్లా రెండో స్థానంలో, 338 కేసులతో కృష్ణా జిల్లా మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.
జిల్లాలవారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది....
అనంతపురం 102
చిత్తూరు 96
తూర్పు గోదావరి 46
గుంటూరు 376
కడప 96
కృష్ణా 338
కర్నూలు 553
నెల్లూరు 96
ప్రకాశం 61
శ్రీకాకుళం 5
విశాఖపట్నం 62
విజయనగరం 4
పశ్చిమ గోదావరి 68